Nagarjuna Yadav: రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నప్పుడు స్థాయి మర్చిపోకూడదు. ముఖ్యంగా కుటుంబ సంబంధాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మీద విమర్శలు చేస్తున్నప్పుడు కాస్త నోటిని అదుపులోకి పెట్టుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం.. సొంత మీడియా ఉంది.. అడ్డగోలుగా అనేస్తాం.. ఆపే వాడెవడు.. అనేవాడు ఎవడు.. అంతా మా ఇష్టమంటే వ్యవస్థలు ఊరుకోవు.
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసిపి నాయకులకు మతి భ్రమించినట్లు కనిపిస్తోంది. వాస్తవ దూరంగా వాళ్ళ మాటలు ఉంటున్నాయి. వాళ్ల చేతలు కూడా బి గ్రేడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం మీద వైసిపి నాయకులు ఉద్యమం చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. విమర్శించాలి అంటే చాలా వ్యవహారాలు ఉన్నాయి. వీటన్నింటిని పక్కనపెట్టి.. అసలు ఎంటువంటి సంబంధం లేని విషయాలను తెర మీదికి తీసుకురావడం.. అందులో వాస్తవ దూరంగా విమర్శలు చేయడం.. ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా మాట్లాడటం వైసిపి నాయకులకు ఇటీవల కాలంలో అలవాటుగా మారిపోయింది.
వైసిపి అధికార ప్రతినిధిగా నాగార్జున యాదవ్ కొనసాగుతున్నారు. ఆమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మీద చేసిన విమర్శలకు అక్కడి పోలీసులు గట్టిగానే ఈయనకు సన్మానం చేశారు. అయినప్పటికీ ఈయన చిప్ సెట్ కానట్టుంది. అందువల్లే మరోసారి తన అధమ స్థాయిని నిరూపించుకున్నారు. సొంత ఛానల్ లో గట్టిగా చూపిస్తున్నారు . సొంత పేపర్లో ప్రయారిటీ ఇస్తున్నారు అని రెచ్చిపోయాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన దివంగత నేత ఎర్రం నాయుడు మీద లేకి కూతలు కూశాడు. ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మిగతావారు ఎందుకు బతికారు. అసలు దీని వెనుక ఉన్నది ఎవరు.. అచ్చెం నాయుడు మీద లేనిపోని విమర్శలు చేశారు. తన రాజకీయ ఎదుగుదల కోసం ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడని మండిపడ్డాడు. వాస్తవానికి ఎర్రం నాయుడు నిజాయితీగల నాయకుడు ఆయనను తన దైవంగా భావిస్తుంటాడు అచ్చం నాయుడు. ఆయన చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయంగా ఎదగడానికి అచ్చం నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఒక రకంగా తన సొంత కొడుకు కంటే ఎక్కువగా ఆయనను చూసుకున్నారు. ఇప్పటికీ వారిద్దరి మధ్య తండ్రి కొడుకుల సంబంధం బలంగా కొనసాగుతోంది. అయినప్పటికీ కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధంగా నాగార్జున యాదవ్ కొత్త విషయాన్ని కనుగొన్నట్టు.. తాను ఏదో పరిశీలన చేసి గొప్ప పని చేసినట్టు.. ఎర్రం నాయుడు మృతి మీద ఏదేదో వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వారికి వైసిపిలో ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు.. అసలు ఆ పార్టీలో ఎందుకు ఉంచుకుంటున్నారు.. అసలు అర్థం కావడంలేదని టిడిపి నేతలు అంటున్నారు. మొన్నటి తెలంగాణ పోలీసుల సన్మానం సరిపోనట్టుంది.. ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా చేయాలేమోనని.. టిడిపి నేతలు చెబుతున్నారు.