Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియనే. ఈమెకు ఉన్న ఫేమ్, ఫ్యాన్ బేస్ కి సరిగ్గా ఆడుతూ ముందుకు పొయ్యుంటే ఆమె చేతిలో కప్ ఉండేది. ఆమె దరిదాపుల్లో కూడా మరో కంటెస్టెంట్ ఉండేవాళ్ళు కాదు. మొదటి రెండు వారాల్లో ఈమె ఓటింగ్ నిఖిల్ కంటే ఎక్కువ ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె తన ఫోకస్ ని ఆట వైపు నుండి పృథ్వీ వైపుకు షిఫ్ట్ చేసింది. ఇక అప్పటి నుండి ఆమె ఓటింగ్ గ్రాఫ్ పాతాళ లోకంలోకి పడిపోయింది. అసలు ఈమె హౌస్ లోకి వచ్చింది పృథ్వీ కోసమా?, లేకపోతే ఆట కోసమా అనే అనుమానాలు ఆమెని అభిమానించే వాళ్లకు కూడా కలిగింది. ఓట్లు వేయడం దాదాపుగా ఆపేసారు, ఇంతకూ ముందు టైటిల్ రేస్ లో ఉన్న విష్ణు ప్రియా, ఇప్పుడు టాప్ 5 లోకి రావడం కూడా కష్టమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
ఇదంతా పక్కన పెడితే నేడు యాష్మి పృథ్వీ కి గట్టి క్లాస్ పీకింది. ఆమె పృథ్వీ తో మాట్లాడుతూ ‘అసలు మీ ఇద్దరు అంత క్లోజ్ ఉండడం చూసి నాకే ఏదోలా అనిపిస్తుంది, ఇక బయట వాళ్లకు ఎలా అనిపిస్తాది?, నీకు నిజంగానే ఆమె అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయా?’ అని పృథ్వీ ని యష్మీ అడగగా, దానికి పృథ్వీ అలాంటిదేమి లేదు అని అంటాడు. అయితే హౌస్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా, ఆమెతోనే ఎందుకు ఎక్కువ ఉంటున్నావ్ అని పృథ్వీ ని అడగగా, నేనెక్కడ ఉంటున్నాను, ఆ అమ్మాయే నా దగ్గరకి ఊరికే వచ్చేస్తుంది, నా అంతటా నేను ఆమె దగ్గరకు వెళ్లడం చాలా తక్కువ అని అంటాడు పృథ్వీ. అలాంటప్పుడు ఆ అమ్మాయికి కూర్చోబెట్టి స్పష్టంగా చెప్పేయ్, మీ ఇద్దరి ఆట దెబ్బ తింటుంది లేకపోతే అని అంటుంది యష్మీ.
దీంతో పృథ్వీ లోపలకు వెళ్లి విష్ణు ప్రియని కూర్చోబెట్టుకొని ‘నీకు ముందుగానే క్లారిటీ గా చెప్పాను. హౌస్ లో నేను ఇక్కడ ఎవరితో రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదని. నేను సింగల్ గా ఉండడానికే ఇష్టపడతాను. నీకు నా మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా?’ అని విష్ణు ప్రియా ని అడుగగా, దానికి విష్ణు సమాధానం చెప్తూ ‘నీకేమి అనిపిస్తుంది..నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావ్ కదా’ అని అడగగా, దానికి పృథ్వీ ‘నాకు అలాగే అనిపిస్తుంది’ అని అంటాడు. మన ఇద్దరం స్నేహితులం లాగానే ఉందాము, నాకు అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఒకవేళ నీకు ఫీలింగ్స్ ఉంటే ఇక్కడితో కట్ చేయడం బెటర్ అని అంటాడు పృథ్వీ. ఇలా ముఖం మీదనే నేరుగా చెప్పేయడంతో విష్ణుప్రియ చాలా బాధపడుతుంది. బెడ్ రూమ్ కి వెళ్లి ఎమోషనల్ అవుతుండడాన్ని చూసిన నభీల్ ఏమి ఫీల్ అవ్వకు, నీకు మంచి మొగుడు వస్తాడులే అని అంటాడు. అయితే విష్ణుప్రియ ఇక నుండి అయినా పృథ్వీ కి దూరంగా ఉంటుందేమో అని అందరూ అనుకుంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె పృథ్వీ కాళ్లకు మసాజ్ చేస్తూ కనిపించింది. దీంతో ఈమె ఈ జన్మకి మారదు అని ఆమె అభిమానులకు కూడా అర్థం అయిపోయింది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 prithvi warns vishnu priya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com