Bigg Boss Telugu 10: రేపటి నుండి ‘బిగ్ బాస్ 10’ కి సంబంధించిన ‘అగ్నిపరీక్ష 2’ షో స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ఆడిషన్స్ నిర్వహించారు, వేల అప్లికేషన్స్ నుండి 15 మందిని చివరి రౌండ్ కి ఎంపిక చేశారు. వీరికి అనేక టాస్కులు నిర్వహించి , అత్యధిక ప్రతిభ కనబర్చిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతం లో లాగానే ఈసారి కూడా 8 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపే అవకాశాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని జడ్జీలు నేరుగా ఎంపిక చేసి పంపుతారు. మిగిలిన వాళ్ళని ఓటింగ్ ద్వారా పంపిస్తారు.
అయితే గతం లో ‘అగ్ని పరీక్ష’ షో పై పెద్దగా వివాదాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం టెలికాస్ట్ అవ్వకముందే తీవ్రమైన వివాదాలను ఎదురుకుంటోంది. ఎందుకంటే హోల్డ్ లో పెట్టిన 8 మంది కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్కులు నిర్వహించకుండానే ఎలిమినేట్ చేశారు. దీనిపై పెద్ద చర్చనే సోషల్ మీడియా లో నడుస్తోంది. మరోపక్క ఈ షో కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయట పడింది. సెలబ్రిటీ లీగ్ నుండి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న ప్రతీ కంటెస్టెంట్ కి వారానికి లక్షకు పైగానే రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. లక్ష నుండి మొదలై 4 లక్షలకు వరకు తీసుకునే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారట. ఉదాహరణకు ఆటో రాంప్రసాద్ మంచి క్రేజ్ , పాపులారిటీ ఉన్న కమెడియన్ కాబట్టి , ఈయనకు ‘బిగ్ బాస్ 10’ లో వారానికి 4 లక్షల రూపాయిలు ఇవ్వబోతున్నారట. మరి ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సామాన్యుల పరిస్థితి ఏంటి అనే విషయం పైన కూడా సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ షో లో పాల్గొనే కామనర్స్ కి వారానికి 30 నుండి 70 వేల వరకు రెమ్యూనరేషన్ ని ఇవ్వొచ్చట. వీరిలో చాలా మంది ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలు ఉన్నారు. వీళ్లకు 50 నుండి 70 వేల మధ్యలో ఇస్తారట. ఇక ఎలాంటి ఫేమ్ లేనటువంటి సామాన్యులకు మాత్రం వారానికి 30 నుండి 50 వేల మధ్యలో ఇస్తారట. గత సీజన్ లో కూడా ఇలాగే చేసారని, ఈసారి కూడా అదే అనుసరిస్తున్నారట. కానీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాత్రం , కనీసం వారానికి లక్ష అయినా ఇస్తే బాగుంటుంది , లక్ష కంటే తక్కువ ఇవ్వడం అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.