Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: తారుమారైన 'అగ్ని పరీక్ష 2' ఓటింగ్..దూసుకొస్తున్న వీక్ కంటెస్టెంట్.. ఇది...

Bigg Boss Agnipariksha 2: తారుమారైన ‘అగ్ని పరీక్ష 2’ ఓటింగ్..దూసుకొస్తున్న వీక్ కంటెస్టెంట్.. ఇది అసలు ఊహించలేదు!

Bigg Boss Agnipariksha 2: మరో వారం రోజుల్లో స్టార్ మా ఛానల్ లో ‘బిగ్ బాస్ 10’ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ‘అగ్ని పరీక్ష 2’ నుండి చాకు లాంటి కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ఇప్పటికే ‘టికెట్ టు బిగ్ బాస్ 10’ టాస్కులు గెలిచి, ఝాన్సీ […]

Bigg Boss Agnipariksha 2: మరో వారం రోజుల్లో స్టార్ మా ఛానల్ లో ‘బిగ్ బాస్ 10’ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ‘అగ్ని పరీక్ష 2’ నుండి చాకు లాంటి కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ఇప్పటికే ‘టికెట్ టు బిగ్ బాస్ 10’ టాస్కులు గెలిచి, ఝాన్సీ బిగ్ బాస్ హౌస్ లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇక ఫినాలే రోజున ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారో చూడాలి. అయితే గత సీజన్ లో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కేవలం ముగ్గురుని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. మిగిలిన ముగ్గురిని జడ్జీల ఛాయస్ ద్వారా పంపారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మాత్రమే టాప్ 6 కంటెస్టెంట్స్ ని లోపలకు పంపబోతున్నారు అట. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్ ప్రకారం చూస్తే, కనీవినీ ఎరుగని రేంజ్ మెజారిటీ తో రోహిత్ నాయుడు నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఈయన ఎంట్రీ ఖరారు అయ్యినట్టే. ఈయన తర్వాతి స్థానం లో అమన్ కొనసాగుతున్నాడు. ఇతను కూడా నూటికి నూరు శాతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళ తర్వాత మూడవ స్థానం లో రాజకుమారి దయానా కొనసాగుతుంది. ఈమెకు ఇంకా బెటర్ ఓటింగ్ ఉండేది కానీ, రీసెంట్ గా సింపతీ డ్రామా ఆడడం తో ఆమె చాలా వరకు వెనుకబడింది. అయితే ఈ ముగ్గురికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టకుండా ఎవ్వరూ ఆపలేరు.

కానీ వీళ్ళతో సమానంగా ఝాన్సీ కూడా మంచి ఫ్యాన్ బేస్ తో కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ దొరకడం తో, ఈమె ఓటింగ్ ఇతర కంటెస్టెంట్స్ కి షేర్ అవ్వనుంది. అలా షేర్ అవ్వగా, నిన్న రామకృష్ణ బాగా హైలైట్ అవ్వడం తో ఝాన్సీ ఓటు బ్యాంక్ ఇతనికి షిఫ్ట్ అయ్యింది. దీంతో ఆయన నేరుగా నాల్గవ స్థానానికి ఎగబాకాడు. ఇక ఈయన తర్వాతి స్థానం లో మితిలేష్, ఆ తర్వాత చరణ్, షాలిని ఉన్నారు. ఈ 7 మంది బిగ్ బాస్ హౌస్ లోకి ఫినాలే రోజున ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper