Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే ఈ చిత్రానికి ఆడియన్స్ లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉండేవి. టీజర్, ట్రైలర్, పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రవితేజ కచ్చితంగా భారీ కం బ్యాక్ ఇస్తాడని అందరూ ఊహించారు కానీ, పాన్ ఇండియన్ స్టార్ హీరోల సినిమాలను సైతం డామినేట్ చేసే రేంజ్ లో కం బ్యాక్ ఇస్తాడని అసలు ఊహించలేదు. విడుదలై వారం రోజులు పూర్తి అయ్యింది. అయినప్పటికీ బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 20 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ విశేల్షకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 7 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి వారం 31 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప ,ఎవరికీ ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ఫుల్ రన్ లో 50 కోట్ల మార్కుని కూడా ఈ చిత్రం అందుకుంటుందని అంటున్నారు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 8 కోట్ల 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 6 కోట్ల 45 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 4 కోట్ల 36 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 62 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 3 కోట్ల 90 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 3 కోట్ల 53 లక్షలు, నెల్లూరు నుండి 1 కోటి 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 63 కోట్ల 43 లక్షల షేర్ వసూళ్లు, 100 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం లో 77 కోట్ల 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 133 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ చిత్రానికి ఇప్పటి వరకు 56 కోట్ల 73 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఈ లాభాల సంఖ్య 70 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రవితేజ సరైన హిట్ కొడితే ఇలా ఉంటుంది మరీ.