Kalyan Padala Bigg Boss: పాన్ ఇండియా లెవెల్లో ప్రతీ ఒక్కరు విపరీతంగా ఎంజాయ్ చేసే రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే , అది బిగ్ బాస్ షోనే. విదేశాల్లో పాపులర్ అయినటువంటి ‘బిగ్ బ్రదర్’ కాన్సెప్ట్ ని మన ఇండియా లోకి ‘బిగ్ బాస్’ పేరుతో తీసుకొచ్చింది ఎండమోల్ షైన్ సంస్థ. ముందు హిందీ లో మొదలు పెట్టారు, అక్కడ ఆడియన్స్ నుండి అమోఘమైన రెస్పాన్స్ రావడంతో కన్నడ, తమిళం , తెలుగు , మలయాళం భాషల్లో కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా బంగ్లా భాషలో కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ షో కి హోస్ట్ గా మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరించనున్నారు. ఈ 6 భాషలకు సంబంధించిన బిగ్ బాస్ షోస్ ఈసారి ఒకే సమయంలో ప్రారంభించబోతున్నారు అట. సెప్టెంబర్ 6 న ఈ షో అన్ని భాషల్లోనూ మొదలు కానుంది.
అయితే రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ‘బిగ్ బాస్ కాఫీ టేబుల్ ‘ అనే బుక్ ని విడుదల చేసింది. ఈ బుక్ లో బిగ్ బాస్ జర్నీ తాలూకు అరుదైన రికార్డ్స్ ని పొందుపరిచారు. ఆ బుక్ లో ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తుంటే, ఈ షోకి సగటున ప్రతీ ఏడాది 500 మిలియన్ వ్యూస్ వస్తున్నాయట. అంటే భారతదేశంలో 50 కోట్ల మంది ఈ షో ని చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియా లో అయితే ఈ రియాలిటీ షో ని ప్రతీ 10 మంది లో 8 మంది చూస్తున్నారట. అంతే కాకుండా ‘బిగ్ బాస్ 9’ లో సామాన్యుడిగా అగ్నిపరీక్ష షో ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల కి గ్రాండ్ ఫినాలే లో పబ్లిక్ నుండి 65 శాతం ఓటింగ్ పడిందని , ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక చరిత్ర అంటూ చెప్పుకొస్తున్నారు.
అంతే కాకుండా సామాన్యుడిగా , అతి చిన్న వయస్సులో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిల్చిన ఏకైక కంటెస్టెంట్ కూడా కళ్యాణ్ పడాల నే అట. హిందీ లో ఇప్పటికే సామాన్యుల క్యాటగిరీ లో టైటిల్ ని గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ, కళ్యాణ్ సామాన్యుడు + యంగ్ క్యాటగిరీ లో టైటిల్ గెలిచిన మొట్టమొదటి వ్యక్తి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కళ్యాణ్ టైటిల్ గెలిచినప్పుడు , అతని విజయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. కావాలని తనూజ ని తొక్కేశారని , కళ్యాణ్ పడాల కి తక్కువ ఓటింగ్ వచ్చినప్పటికీ అతన్ని విన్నర్ గా ప్రకటించారంటూ సోషల్ మీడియా లో పోస్టులు కూడా వేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా బిగ్ బాస్ టీం కళ్యాణ్ కి పడిన ఓటింగ్ శాతం ఎంతో రివీల్ చేసింది. అతనొక్కడికే 65 శాతం ఓటింగ్ రాగా, మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ కి కలిపి 35 శాతం ఓటింగ్ నమోదైంది అట.