Tanuja: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్ కి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. నిధి అగర్వాల్(Nidhi Agarwal) తో మొదలైన ఈ రచ్చ, నేడు ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) రన్నర్ తనూజ(Thanuja) వరకు చేరింది. వీళ్ళు రాగానే అభిమానులు కుప్పలు తెప్పలుగా ఒకేసారి మీదకు తీసుకొని రావడం వల్ల, క్రింద పడిపోయే పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఇప్పుడు తనూజ కి కూడా దాదాపుగా అలాంటి పరిస్థితే ఎదురైంది కానీ, ఆమెతో పాటు ఉన్నటువంటి బాడీ గార్డ్స్ కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని ‘ఆవకాయ్’ రెస్టారంట్ ఓపెనింగ్ కి తనూజ మొన్న వచ్చింది. ఆమె కారు దిగగానే అభిమానులు వందల సంఖ్యలో చుట్టూ ముట్టారు. కారు దిగిన దగ్గర నుండి రెస్టారంట్ లోపలకు వెళ్ళడానికి ఆమెకు చాలా సమయమే పట్టింది. ఎందుకంటే అంత జనాలు ఉన్నారు అన్నమాట.
ఒక అభిమాని అయితే ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు, కానీ ఆమె బాడీ గార్డ్స్ వెనక్కి నెట్టేశారు. తన అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయినందుకు తనూజ కాస్త ఫీల్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినీ సెలబ్రిటీలకు ఇలాంటి ఘటనలు తప్పడం లేదు, చివరికి బిగ్ బాస్ సెలబ్రిటీలకు కూడా ఇలాంటి పరిస్థితి యేనా?, ఏమైంది ఈమధ్య హైదరాబాద్ ప్రజానీకానికి అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు . ఇక తనూజ విషయానికి వస్తే ఈమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కంటెస్టెంట్ న కూడా కలవలేదు. హౌస్ లో ఈమె అత్యంత సన్నిహితంగా ఉండే భరణి , కళ్యాణ్ లను కూడా ఇప్పటి వరకు కలవలేదు.
గత వారం ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో కూడా తనూజ రాలేదు. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అత్యధిక శాతం సమయం ఆమె తన కుటుంబానికి కేటాయించింది . ఆ తర్వాత అనాధాశ్రమం కి వెళ్ళింది. ఇన్ స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లో అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అయ్యింది. ఇక ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఎప్పుడు కలవబోతుంది అనే దానిపై ఆమె అభిమానుల్లి క్యూరియాసిటీ పెరిగింది. అయితే రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ‘మా సంక్రాంతి సంబరాలు’ ఈవెంట్ షూటింగ్ జరిగింది. ఈ ఈవెంట్ కి తనూజ హాజరైనట్టు సమాచారం. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన రెండువారాల తర్వాత ఆమెని మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో చూడబోతున్నాము అన్నమాట.
View this post on Instagram