Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: ఓటింగ్లో రైతు బిడ్డ, పాట బిడ్డ జోరు... డేంజర్ జోన్లో...

Bigg Boss 7 Telugu: ఓటింగ్లో రైతు బిడ్డ, పాట బిడ్డ జోరు… డేంజర్ జోన్లో ఊహించని కంటెస్టెంట్!

నామినేషన్స్ ప్రక్రియ ముగియగా అమర్ దీప్, తేజ, గౌతమ్, పల్లవి ప్రశాంత్, పూజా, భోలే, అశ్విని నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.

Bigg Boss 7 Telugu: ఏడవ వారానికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. మెజారిటీ కంటెస్టెంట్స్ అశ్విని, బోలేను నామినేట్ చేశారు. కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. భోలేతో ప్రియాంక, శోభా శెట్టిల గొడవైతే హద్దులు దాటేసింది. ప్రియాంక అయితే థూ అని భోలేని ఉద్దేశించి ఊయడం కొంచెం అతిగా అనిపించింది. సీరియల్ బ్యాచ్ సివంగుల్లా భోలే మీద దాడికి దిగారు. నామినేషన్స్ అనంతరం కూడా భోలేతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. తమ వద్ద నుండి వెళ్లిపోవాలని సీరియస్ అయ్యారు.

నామినేషన్స్ ప్రక్రియ ముగియగా అమర్ దీప్, తేజ, గౌతమ్, పల్లవి ప్రశాంత్, పూజా, భోలే, అశ్విని నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. నిన్నటి నుండే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ వివరాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఓటింగ్ రిజల్ట్స్ ఊహించని విధంగా ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ గేమ్ పై కొంత నెగిటివిటీ వినిపిస్తుంది. సందీప్ నామినేషన్స్ లో అతడు తడబడ్డాడు. తప్పుడు ఆరోపణ చేశాడనే వాదన వినిపించింది.

దీంతో పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ తగ్గే అవకాశం కలదన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే అవన్నీ అపోహలే అని తేలిపోయింది. ఏకంగా 40 శాతానికి పైగా ఓట్లతో పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడట. ఇక రెండో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడట. మరో ట్విస్ట్ ఏంటంటే మూడో స్థానంలో భోలే కొనసాగడం. మెజారిటీ హౌస్ మేట్స్ అతన్ని టార్గెట్ చేశారు. అది ప్లస్ అయిందేమో కానీ… భోలే టాప్ 3లో ఉన్నాడట.

ఇక నాలుగో స్థానంలో గౌతమ్, ఐదో స్థానంలో తేజా ఉన్నారట. డేంజర్ జోన్లో అశ్వినీ శ్రీ, పూజా ఉన్నారట. పూజ చివరి స్థానంలో ఉంది. అశ్విని కంటే పూజా మూడు శాతం ఓట్లు వెనుకబడిందట. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే… పూజా మూర్తి ఇంటిని వీడటం ఖాయం. శుక్రవారంతో ఓటింగ్ ముగుస్తుంది. మరోవైపు ఎలిమినేట్ అయిన దామిని, రతికా రోజ్, శుభశ్రీలలో ఒకరు హౌస్లోకి రానున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper