Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ షో లో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఝాన్సీ. ముఖ్యంగా టికెట్ టు బిగ్ బాస్ టాస్కుల్లో , అమన్, దీపక్ వంటి తోపు కంటెస్టెంట్స్ ని ఓడించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆమె తోటి కంటెస్టెంట్స్ కూడా షాక్ కి గురై చప్పట్లు కొట్టారు, ఝాన్సీ ని పొగడ్తల వర్షం లో ముంచెత్తారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె చాలా గట్టిగా ఆడుతుంది , టాప్ 5 వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే , ఈమె ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో దారుణంగా విఫలం అయ్యింది. ఇప్పటి వరకు ఈమె ఒక్క టాస్క్ లో కూడా షైన్ అవ్వలేదు. పైగా ఈమె ప్రవర్తన ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు.
‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ కి దూరం వ్యవహరిస్తూ మొదటి రోజు నుండే ఈమె సెలబ్రిటీలతో చేతులు కలిపింది , వాళ్ళని వదిలి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు. ఇక్కడి నుండే ఝాన్సీ పై ఆడియన్స్ లో తీవ్రమైన నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత చరణ్ ఎలిమినేషన్ ముందు రోజు , ఝాన్సీ వద్దకు వచ్చి , చాలా బాధ పడుతూ , అవకాశం వస్తే నాకు ఓటు వెయ్యి అని అడగడం, ఆ క్షణం లో ఝాన్సీ పాజిటివ్ గా స్పందించి , చివరికి ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు అతనికి వెన్నుపోటు పొడవడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఈమెని ఎంతో ఊహించుకున్నాము , తీరా చూస్తే ఇలా ప్రవర్తిస్తుందేంటి, ఈమె ఇంత కన్నింగ్ గా ఉంటుందని అసలు అనుకోలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.
ఇదంతా పక్కన పెడితే నేడు నామినేషన్స్ లో ఈమె రైతు గెటప్ లో కూర్చోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. ‘బిగ్ బాస్ 7’ లో పల్లవి ప్రశాంత్ లాగానే , ఈమె కూడా రైతు బిడ్డ సెంటిమెంట్ ని వాడుకునే ప్రయత్నం చేస్తుందని , కానీ ఆరోజులు ఇప్పుడు లేవని, సెంటిమెంట్ ని చూసి ఓట్లు వేసే ఆడియన్స్ బాగా తగ్గిపోయారని , కాబట్టి ఇలాంటి డ్రామా అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అంతే కాదు , ఈమె నామినేషన్ ప్రక్రియ ని సరిగా గౌరవించనందుకు బిగ్ బాస్ నుండి ఒక వార్నింగ్ కాల్ కూడా వచ్చింది. ఈ వారం కృష్ణుడు నామినేషన్స్ లో లేకపోయుంటే , కచ్చితంగా ఝాన్సీ ఎలిమినేట్ అయ్యేది , ఎందుకంటే ఆమె పై అంతటి నెగిటివిటీ సోషల్ మీడియా లో ఏర్పడింది అని అంటున్నారు నెటిజెన్స్.