Bigg Boss Telugu 10: వచ్చే నెల 6 నుండి బిగ్ బాస్ 10 సీజన్ ప్రారంభం కానున్న సందర్భంగా సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సీజన్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా 6 నుండి 8 మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక వీళ్ళ టాలెంట్ ని చూసి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ భయపడుతున్నారు. గత సీజన్ లో కూడా సామాన్యుడే టైటిల్ గెలవడం , మరొకరు టాప్ 3 లో నిలవడం వంటివి చూసి , సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో లో పాల్గొనేందుకు పూర్తి స్థాయిలో సిద్దమైన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఆటో రామ్ ప్రసాద్, యాంకర్ వర్షిణి మాత్రమే.
ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఇద్దరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఖరారు అయ్యినట్టు తెలుస్తోంది. అందులో ఒకరు సీరియల్ హీరోయిన్ సుహాసిని కాగా , మరొకరు టెంపర్ వంశీ. సుహాసిని గతం లో ‘చంటిగాడు’ అనే చిత్రం తో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె టీవీ సీరియల్స్ కి పరిమితమైంది. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈమె, ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా రెగ్యులర్ గా పాల్గొంటూ ఉంటుంది. రీసెంట్ గానే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో కూడా ఈమె ‘జాతి రత్నం’ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈమె ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక టెంపర్ వంశీ విషయానికి వస్తే , ఈయన టాలీవుడ్ లో ఒక పాపులర్ విలన్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ‘టెంపర్’ చిత్రం లో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా ఈయన అద్భుతమైన నటన కనబర్చాడు. ఆ తర్వాత వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా చేసిన ఈయన , ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో కూడా నటించాడు. ఇంతటి బిజీ ఆర్టిస్ట్ ‘బిగ్ బాస్ 10’ లోకి రావడం గమనార్హం. ఇప్పటి వరకు పేరు మోసిన విలన్స్ గా పిలవబడే ఎంతో మంది , బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మంచి మనస్సు ఉన్నవాళ్లు గా పేరు తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మరి టెంపర్ వంశీ కి కూడా అలాంటి పేరే వస్తుందా అనేది చూడాలి.