Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లోవర్షిణి, ముఖేష్ రొమాన్స్ పీక్స్.. ఈ...

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లోవర్షిణి, ముఖేష్ రొమాన్స్ పీక్స్.. ఈ దృశ్యాలు చూడలేమబ్బా

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కాంట్రవర్సీలకు అవకాశం లేదా అనుకుంటున్న క్రమంలో మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు వర్షిణి, ముఖేష్. హౌస్ లో ఆట తీరుతో అభిమానుల మనసు గెలుచుకోవాల్సిన వీరు.. రొమాన్స్ తో దుమ్ము లేపుతున్నారు. అసలు వీళ్ళ కెమిస్ట్రీ చూసి తోటి కంటెస్టెంట్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కళ్ళను మూసుకుంటున్నారు. అసలు ఇదేం దరిద్రం.. ఈ ముద్దులేంటి.. హగ్గులేంటి.. హౌస్ కు ఎందుకు వచ్చారు.. ఈ పని కోసమా […]

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కాంట్రవర్సీలకు అవకాశం లేదా అనుకుంటున్న క్రమంలో మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు వర్షిణి, ముఖేష్. హౌస్ లో ఆట తీరుతో అభిమానుల మనసు గెలుచుకోవాల్సిన వీరు.. రొమాన్స్ తో దుమ్ము లేపుతున్నారు. అసలు వీళ్ళ కెమిస్ట్రీ చూసి తోటి కంటెస్టెంట్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కళ్ళను మూసుకుంటున్నారు. అసలు ఇదేం దరిద్రం.. ఈ ముద్దులేంటి.. హగ్గులేంటి.. హౌస్ కు ఎందుకు వచ్చారు.. ఈ పని కోసమా అంటూ కంటెస్టెంట్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో అక్కడికక్కడ జోడిలు పుట్టడం.. వారు మింగిల్ అవ్వడం కొత్తకాక పోయినప్పటికీ.. ఈ విషయంలో వర్షిణి, ముఖేష్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. గత సీజన్లో విష్ణు ప్రియ రచ్చ రంబోలా చేస్తే.. ఆమెను మించిపోతోంది వర్షిణి. వాస్తవానికి సెలబ్రిటీ కోటాలో వచ్చిన ఈమె.. గొప్పగా ఆడుతుందని.. అదరగొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం మాత్రం అలా లేదు. టాస్కులలో తనదైన శైలి చూపించడం లేదు. ఆటతీరులో దూకుడు కనిపించడం లేదు. సెలబ్రిటీ కోటాలో ఉంది అంటే ఉంది. ఈమె గ్లామర్ షోకు ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె కంటే శ్రేష్ఠి.. అపూర్వ బెటర్ అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఓటింగ్లో వర్షిణి పెద్దగా తన ప్రభావం చూపించడం లేదు. వాస్తవానికి ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉండేది. కానీ అనుకోకుండా బిగ్ బాస్ ఈమె మీద దయ చూపించారు. వచ్చిన అవకాశాన్ని కూడా ఈమె వినియోగించుకోలేకపోతోంది. ఆట తీరుతో ఆకట్టుకోవాల్సిన ఈమె రొమాన్స్ లో మాత్రం హద్దులు దాటిపోతుంది. ఇప్పటివరకు మనకు హిందీ బిగ్ బాస్ మీదనే రకరకాల విమర్శలు.. అభియోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగు బిగ్బాస్ కూడా హిందీ బిగ్ బాస్ ను దాటేసే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షిని రేంజ్ అలా ఉంది మరి. రొమాన్స్ లో ఆమె సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తోంది.

టిఆర్పి రేటింగ్స్ కోసం బిగ్బాస్ టీం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు వర్షిని.. ముఖేష్ రొమాన్స్ కూడా ఇటువంటిదేనని.. కేవలం రేటింగ్స్ కోసమే వారిద్దరి మధ్య ఇలాంటి యవ్వారాలు పెడుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పడం విశేషం. మరిదీనిపై బిగ్ బాస్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఈ షోలో కంటెంట్.. ఇతర అంశాలు చూసే విధంగా ఉండేవి. ఎప్పుడైతే వీరిద్దరి మధ్య వ్యవహారం జోరుగా మొదలైందో అప్పటినుంచే కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ షో ను కేవలం జెన్ జెడ్ మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారు చూస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఇటువంటి దృశ్యాలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే వీరిద్దరి మధ్య రొమాన్స్ డోస్ తగ్గించాలని అభిమానులు కోరుతున్నారు.. ఇటువంటి వాటి వల్ల నెగిటివ్ ప్రచారం మొదలవుతుందని.. అది రేటింగ్స్ మొత్తాన్ని దెబ్బ కొట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper