Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 :బిగ్ బాస్ హౌస్ లో ముకేష్ తో వర్షిణి రొమాన్స్...

Bigg Boss Telugu 10 :బిగ్ బాస్ హౌస్ లో ముకేష్ తో వర్షిణి రొమాన్స్ వెనుక అసలు కథ ఇదే.. భలే స్కెచ్ వేశారుగా..

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ హౌస్ లో వర్షిణి.. ముఖేష్ మధ్య రొమాన్స్ నిజమేనా.. నిజంగా ఇందులో ఏదైనా ఉందా.. ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది.. మొదట్లో వీరిద్దరూ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఉండేవారు.. అలాంటిది వీరిద్దరి మధ్య బలమైన ఎలిమెంట్స్ లేకుండానే స్నేహం ఎలా మొదలైంది.. ఏకంగా రొమాన్స్ చేసుకునే స్థాయికి ఎలా ఎదిగింది.. ఈసారి ముందుగానే.. సాధారణంగా బిగ్బాస్ షో […]

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ హౌస్ లో వర్షిణి.. ముఖేష్ మధ్య రొమాన్స్ నిజమేనా.. నిజంగా ఇందులో ఏదైనా ఉందా.. ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది.. మొదట్లో వీరిద్దరూ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఉండేవారు.. అలాంటిది వీరిద్దరి మధ్య బలమైన ఎలిమెంట్స్ లేకుండానే స్నేహం ఎలా మొదలైంది.. ఏకంగా రొమాన్స్ చేసుకునే స్థాయికి ఎలా ఎదిగింది..

ఈసారి ముందుగానే..

సాధారణంగా బిగ్బాస్ షో స్టార్ట్ అయినప్పుడు దాదాపు 5 లేదా 6 వారంలో రొమాంటిక్ యాంగిల్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ముందుగానే దానిని మొదలుపెట్టారు. అంటే ఈసారి ఆటే పెద్ద సవాల్ అని బిగ్ బాస్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారన్నమాట. పైగా ప్రతి వీకెండ్ లో నాగార్జున వర్షిణి.. ముఖేష్ మధ్య వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావించడం.. కొన్ని వీడియోలు ప్లే చేయడం.. వర్షిణిని ప్రశ్నలు అడగడం.. దానికి ఆమె సిగ్గుపడడం.. ముఖేష్ కూడా సమాధానం చెప్పలేక సిగ్గుపడడం.. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

నాగార్జున అడగడం వెనుక ఓ కారణం

వాస్తవానికి నాగర్జున అలా అడగడం వెనుక కారణముంది. ఎందుకంటే.. ఈసారి ఆటే సవాల్ అన్నారు కాబట్టి కచ్చితంగా రొమాంటిక్ యాంగిల్ ముందుగానే ప్రవేశపెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి. హౌస్ లో వర్షిణి హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్. పైగా ఈమెకి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. బుల్లితెరలో యాంకర్ గా కూడా పని చేసింది. గత కొన్ని సీజన్లు గా ఈమెను బిగ్ బాస్ లోకి రావాలి అని అడుగుతున్నప్పటికీ కూడా.. బిజీగా ఉండడంవల్ల సాధ్యం కాలేదు. ఈ సీజన్లో ఈమెకు భారీగా డబ్బు ఇస్తున్న నేపథ్యంలో.. బిగ్ బాస్ వర్షిణి సేవలను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు.

టాస్క్ లో విఫలం కావడం.. గేమ్ లలో విఫలం కావడంవల్ల.. బిగ్ బాస్ వర్షిణిని లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ చేయలేదు. వాస్తవానికి ఆమె ఎలిమినేషన్ అనేది ఉంది. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ వచ్చింది.. దీనికి తోడు ఆడియన్స్ లో ఆమె మీద పెద్దగా అంచనాలు లేవు. ఉన్నట్టుండి వర్షిణి ని బయటికి పంపిస్తే ఆటలో గ్లామర్ ఉండదు. గ్లామర్ లేకపోతే బిగ్ బాస్ రేటింగ్స్ పడిపోతాయి. అది మొత్తంగా మార్కెటింగ్ స్ట్రాటజీని దెబ్బతీస్తుంది. అందువల్లే బిగ్ బాస్ బృందం ఆమెను ఎలిమినేట్ చేయకుండా.. ముఖేష్ తో రొమాన్స్ చేయించేలా చేస్తోంది.

ముఖేష్ వర్షిణి కలిసి పాటలు పాడటం.. డ్యాన్సులు వేయటం… స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం.. చివరికి ముఖేష్ కాలును వర్షిని గోకటం.. ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీని వెనక అసలు కారణం ఇందాక మనం చెప్పుకున్నది. కొద్దివారాలపాటు వర్షిణి ఎలిమినేట్ కాదు. పైగా ఆమె ఓటింగ్ పెరుగుతుంది. బిగ్ బాస్ షో ను ఒక సెక్షన్ అభిమానులు ఇటువంటి ఎలిమెంట్ కోసమే చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు రేటింగ్స్ పెరుగుతాయి. దీనికి తోడు కొద్ది వారాలపాటు వర్షిణి హౌస్ లో కొనసాగుతుంది. ఆ తర్వాత ఆమెను బయటికి పంపిస్తారు. ఒకవేళ ముఖేష్ గనక సరిగ్గా ఆడితే హౌస్ లో ఉంటాడు. అతడు మధ్యలో వెళ్ళిపోతే అప్పుడు వర్షిని హావభావాలను ఆధారంగా చేసుకుని కొద్దిరోజులపాటు ఆమెతో షో నడిపిస్తారు.

గత సీజన్లో విష్ణు ప్రియతో ఎలా అయితే చేశారో.. ఇప్పుడు వర్షిణితో కూడా అలానే చేస్తారు. కానీ, చివర్లో మాత్రం కచ్చితంగా హ్యాండ్ ఇస్తారు. గడిచిన 9 సీజన్లుగా బిగ్ బాస్ లో జరుగుతున్నది అదే. ఇప్పుడు కూడా జరిగేది అదే. కాకపోతే ఈసారి ఆటే సవాల్ అన్నారు కాబట్టి.. కాస్త ముందుగా రొమాంటిక్ ఎలిమెంట్ ప్రారంభించారు.. అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్. చివరగా మితిలేష్ 15 లక్షలు తీసుకొని వెళ్ళిపోవడం కూడా వర్షిణికి అడ్వాంటేజ్ గా మారింది. ఎందుకంటే బలమైన కంటెస్టెంట్ వెళ్లిపోతే.. షో రన్ చేయడం కుదరదు. పైగా మితిలేష్ వెళ్ళిపోవడం ద్వారా షో మీద బజ్ తగ్గిపోయింది. ఆ తర్వాత వర్షిణిని కూడా పంపిస్తే అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అందువల్లే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper