Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Health: పవన్ కు ఏమైంది?.. 20 రోజులపాటు రాష్ట్రానికి దూరంగా!

Pawan Kalyan Health: పవన్ కు ఏమైంది?.. 20 రోజులపాటు రాష్ట్రానికి దూరంగా!

Pawan Kalyan Health: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ తరుణంలో కేరళ వెళ్లి ప్రకృతి వైద్య సేవలు పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి 20 రోజులపాటు ఆయన కేరళలో ఉంటారని తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు పవన్. కానీ ఆరోగ్యం కుదుటపడడం లేదు. వాతావరణం లో వస్తున్న మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటు పలు సమస్యలతో బాధపడుతున్నారు. […]

Pawan Kalyan Health: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ తరుణంలో కేరళ వెళ్లి ప్రకృతి వైద్య సేవలు పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి 20 రోజులపాటు ఆయన కేరళలో ఉంటారని తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు పవన్. కానీ ఆరోగ్యం కుదుటపడడం లేదు. వాతావరణం లో వస్తున్న మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటు పలు సమస్యలతో బాధపడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వెళ్లిపోయారు. తరచూ అనారోగ్యానికి గురికావడంతో క్యాబినెట్ సమావేశాలతో పాటు కలెక్టర్ల రివ్యూలకు సైతం గైర్హాజరవుతున్నారు.

* కేరళ ప్రకృతి వైద్యం..
తన అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం కోసం ఆయన కేరళ ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ ముక్కు కు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. అమరావతిలో అధికారులతో సమీక్షించే సమయంలో ఆయన ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. వెంటనే తన కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆసుపత్రిలో చేరారు. ఆయన సైనసైటిస్ తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తేల్చి ముక్కుకు సర్జరీ చేయాలని సూచించారు. ఈ సర్జరీ తరువాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. కోలుకొని తిరిగి అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు.

* కుడి భుజానికి ఆపరేషన్…
అక్కడకు కొద్ది రోజులకు పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉన్నాయి. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో జూలై నెలలో ఆయన కుడి భుజానికి ముంబైలోని కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేస్తే ఇబ్బంది పడతారని.. ముందు కుడి భుజానికి సర్జరీ చేశారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ భుజానికి 2016 లోనే గాయాలయ్యాయి. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ ఆయన వినలేదు. పవన్ పర్యటనలతో ఆయనతో కరచలనం చేసేందుకు అభిమానులు ఎగబడే వారు. చేతులు గట్టిగా లాగే వారు. దీంతో ఆయన నొప్పితో బాధపడేవారు.

* అనారోగ్యం తీవ్రం కావడంతో..
ఒకవైపు భుజం నొప్పి, మరోవైపు నిత్యం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఇబ్బంది పడుతున్నారు పవన్. అందుకే శాశ్వత పరిష్కారం కోసం కేరళ ప్రకృతి వైద్య కేంద్రానికి వెళ్లాలని వైద్య నిపుణులు సూచించారు. దీంతో 20 రోజులపాటు అక్కడే ఉండి వైద్య సేవలు పొందనున్నారు. అధికారిక రాజకీయ సభల్లో పవన్ కొద్ది రోజులపాటు పాల్గొనరు. అయితే సొంత శాఖకు సంబంధించి కీలకమైన ఫైళ్లపై ఆన్లైన్లో దృష్టిపెట్టనున్నారు. మొత్తానికి అయితే 20 రోజులపాటు పవన్ అందుబాటులో ఉండరన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper