spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna And Gopichand Malineni: బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీ మదర్ సెంటిమెంట్ తో...

Balakrishna And Gopichand Malineni: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ మదర్ సెంటిమెంట్ తో వస్తుందా..?

Balakrishna And Gopichand Malineni: బాలయ్య బాబు సినిమా అంటే చాలు ప్రేక్షకులకు పూనకాలు వస్తాయి. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో యాక్షన్ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండాలి. అందులో ఏ కొంచెం తగ్గినా కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో అయితే ఉండరు. ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే స్క్రీన్ మీద శివతాండవం చేస్తూ ఉంటాడు. రౌడీలను నరికే తీరు చూసి ప్రేక్షకులందరు విజిల్స్ వేస్తూ ఉంటారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా అలాంటి నేపథ్యం లోనే తెరకెక్కుతుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడం అందులోని ఇది మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు మదర్ సెంటిమెంట్ తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి. కేజీఎఫ్ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నాయని మరి కొంతమంది తెలియజేస్తున్నారు. మొత్తానికైతే గోపీచంద్ మలినేని ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ తనా అభిమానులు సైతం ఆనంద పడుతున్నారు…

ఇప్పటివరకు బాలయ్య బాబు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. వరుసగా నాలుగు విజయాలకు ‘అఖండ 2’ సినిమాతో బ్రేక్ పడింది. కాబట్టి మరోసారి తను సక్సెస్ ని సాధించి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ మూవీతో సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

గోపిచంద్ మలినేని గత సంవత్సరం జాట్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. బాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. అందువల్లే ఈ సినిమాకి అనుకున్నంత పేరు రాలేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా గోపీచంద్ మలినేని కి చాలా గొప్ప గుర్తింపునైతే తీసుకొచ్చింది.

సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సైతం గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తాను అని చెప్పాడు. ఆ మూవీ అతనికి అక్కడ ఎంతటి క్రేజ్ ను సంపాదించి పెట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో బాలయ్య బాబుని మరో మెట్టు పైకి ఎక్కిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
Oktelugu Epaper