Allu Arjun Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నా సబ్జెక్ట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం లేదు. ప్రస్తుతం తెలుగు హీరోల హవా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోలు ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయం మీద వాళ్లకి సరైన క్లారిటీ రావడం లేదు. అందువల్లే వాళ్ళు చేసిన సినిమాలు చేసినట్టుగా డిజాస్టర్ అవుతున్నాయి. రీసెంట్ గా దురంధర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికి దాని తర్వాత మరో సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ పీకల్లోతూ కష్టాల్లో పడిపోయిందనే చెప్పాలి. బాలీవుడ్ దర్శకులు సైతం అక్కడున్న హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కారణం ఏంటంటే తెలుగు హీరోలతో సినిమాలను చేస్తే వాళ్లకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని బాలీవుడ్ హీరోల కంటే ఇప్పుడు తెలుగు హీరోల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయిందని భావిస్తున్నారు. కాబట్టే మన హీరోల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సంజీలీలా భన్సాలీ సైతం అల్లు అర్జున్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అఫీషియల్ గా కూడా ఈ ప్రాజెక్టు ను అనౌన్స్ చేశారు.
కాబట్టి ఈ రెండు పూర్తయిన తర్వాత సంజలీలా భన్సాలీ డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి… బాలీవుడ్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తారట. వీళ్లు ఎలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
మొత్తానికైతే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత తమిళ్, బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుంటున్నాడు. ఎందుకని తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం లేదు. ఆయనతో సినిమాలు చేయగలిగి కెపాసిటీ ఉన్న దర్శకులు తెలుగులో లేరా అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు…