250 మందికిపైగా హాజరు
TANA Women : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు. నార్త్ కరోలినాలోని హంటర్స్‌విల్లే వెటరన్స్ పార్క్‌లో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 250 మందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ జుంబా ఇన్‌స్ట్రక్టర్ మౌనిక కావలి మహిళలకు డాన్స్ వర్కవుట్‌లో శిక్షణ అందించారు. సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ మహిళలు వర్కవుట్‌లో పాల్గొన్నారు. వ్యాయామంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి సౌమ్యశ్రీ తలంకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పాల్గొన్న మహిళలందరికీ ‘అమోఘం ఇండియన్ రెస్టారెంట్’ సౌజన్యంతో ఉచిత అల్పాహారం అందించారు. దీంతో వర్కవుట్ కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి అల్పాహార వసతి కూడా కల్పించారు.

తానా హెల్త్ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంతో పాటు తెలుగు సమాజంలోని మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, వాలంటీర్లు, పాల్గొన్న మహిళలను తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు అభినందించారు.

ఈ కార్యక్రమం విజయవంతానికి తానా అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్ రవి (నాని) వడ్లమూడి, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి, టీమ్ స్క్వేర్ చైర్ కిరణ్ కొత్తపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, అలాగే జ్యోత్స్న గంటా, పద్మజ కొమ్మినేని తదితరులు కృషి చేశారు.

మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌తో పాటు సామాజిక అనుబంధాలను పెంపొందించేలా నిర్వహించిన ఈ ‘దేశీ డాన్స్ వర్కవుట్’ కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు
