Homeబిజినెస్Samsung Galaxy S26 FE లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు ఇవీ.. వెంటనే త్వరపడండి

Samsung Galaxy S26 FE లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు ఇవీ.. వెంటనే త్వరపడండి

Samsung Galaxy S26 FE : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ తన కొత్త Galaxy S26 FEను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది మోడల్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ ఫ్యాన్‌ ఎడిషన్‌ ఫోన్‌ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 120Hz డిస్‌ప్లే, Exynos 2500 ప్రాసెసర్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర ఎంతంటే.. భారత్‌లో Samsung Galaxy S26 FE 8GB RAM + […]

Samsung Galaxy S26 FE : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ తన కొత్త Galaxy S26 FEను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది మోడల్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ ఫ్యాన్‌ ఎడిషన్‌ ఫోన్‌ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 120Hz డిస్‌ప్లే, Exynos 2500 ప్రాసెసర్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధర ఎంతంటే..

భారత్‌లో Samsung Galaxy S26 FE 8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.79,999గా నిర్ణయించారు. పిస్టాచియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్‌ రంగుల్లో లభిస్తుంది. పాత ఫోన్‌ ఎక్స్‌చేంజ్‌పై రూ.8,000 వరకు అప్‌గ్రేడ్‌ బోనస్‌ పొందొచ్చు. ఎంపిక చేసిన NBFCల ద్వారా 30 నెలల వరకు నో-కాస్ట్‌ EMI సదుపాయం కూడా ఉంది. ప్రధాన బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్లు ఇవే..

Galaxy S26 FEలో 6.7 అంగుళాల FHD+ Dynamic AMOLED 2X డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1,900 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. 3nm టెక్నాలజీతో రూపొందించిన Exynos 2500 చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. 8GB RAM, 256GB స్టోరేజ్‌ ఉన్నాయి.

కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP మెయిన్‌ కెమెరా (OIS), 12MP అల్ట్రావైడ్‌, 8MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. టెలిఫొటో కెమెరా 3x ఆప్టికల్‌ జూమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.

One UI 9 ఆధారిత Android 17తో ఫోన్‌ పనిచేస్తుంది. ఏడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని శామ్‌సంగ్‌ ప్రకటించింది. 4,900mAh బ్యాటరీకి 45W వైర్డ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. IP68 రేటింగ్‌, 5G, Wi-Fi 6E, Bluetooth 5.4 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper