Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడి కి ఆ హీరోయిన్ కి మధ్య ఏం జరిగింది...

Anil Ravipudi: అనిల్ రావిపూడి కి ఆ హీరోయిన్ కి మధ్య ఏం జరిగింది…

Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో కొంతమంది దర్శకులకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది. అందులో అనిల్ రావిపూడి ఒకరు కావడం విశేషం… రాజమౌళి తర్వాత వరుసగా విజయాలను అందుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు వెంకటేష్- కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి […]

Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో కొంతమంది దర్శకులకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది. అందులో అనిల్ రావిపూడి ఒకరు కావడం విశేషం… రాజమౌళి తర్వాత వరుసగా విజయాలను అందుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు వెంకటేష్- కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న పదోవ సినిమాతో సైతం భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అనిల్ రావిపూడి గతంలో ఒక హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేశాడు. దానివల్ల వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. వరుస సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అనిల్ రావిపూడి చేసే సినిమాల్లో క్యారెక్టర్ కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటానని పలు సందర్భాల్లో ఆయన క్లారిటి ఇచ్చాడు.

మొత్తానికైతే ఆ హీరోయిన్ ని ఇప్పుడు తన సినిమాలో రిపీట్ చేయడం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే మెహ్రీన్ కావడం విశేషం… అనిల్ రావిపూడి చేసిన ‘రాజా ది గ్రేట్’, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఇక ఆ సమయంలోనే వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటు కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదంటూ ఆ తర్వాత పలు సందర్భాల్లో అనిల్ రావిపూడి స్పందించాడు.

ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎవరైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారో తన అ క్యారెక్టర్ కి ఎవరైతే న్యాయం చేయగలరో వాళ్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన తన సినిమాలో స్టార్ హీరోయిన్లు పెట్టుకోడు. పెద్దగా ఇమేజ్ లేని హీరోయిన్స్ కి అవకాశాలను ఇస్తూ సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా వాళ్లకి కూడా సక్సెస్ లను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper