Anchors Remunerations: ఒక టీవీ షో పెద్ద హిట్ అవ్వాలంటే , యాంకరింగ్ వేరే లెవెల్ లో ఉండాలి. యాంకరింగ్ లో తమ మార్క్ కామెడీ టైమింగ్ ని చూపించిన వాళ్ళే , ఇండస్ట్రీ లో ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా , చెక్కు చెదరని డిమాండ్ తో కొనసాగగలరు. అలాంటి యాంకర్లు ఒక్కో ఎపిసోడ్ కి , ఒక్కో ఇంటర్వ్యూ కి ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో ఈరోజు మనం చూడబోతున్నాం.
సుమ:
యాంకరింగ్ రంగం లో గత మూడు దశాబ్దాల నుండి తనకు తానే సాటి , ఎవ్వరు లేరు పోటీ అని అనిపించుకుంటున్న సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఈమె కాల్ షీట్స్ కోసం టీవీ షోస్ నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు. ఒకే రోజు రెండు మూడు ప్రోగ్రామ్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతుల్లో ఎలాంటి టీవీ షో లేదు , కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇప్పటికీ గుర్తుకొచ్చేది సుమ మాత్రమే. చిన్న హీరోల దగ్గర నుండి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ సినిమాల వరకు , ప్రతీ ఈవెంట్ కి సుమ నే నిర్మాతలు ఇప్పటికీ కోరుతున్నారు. ఆ రేంజ్ డిమాండ్ ఉన్నప్పుడు , రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తుంది కదా. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే సుమ సినిమా రేంజ్ ని బట్టి , ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 3 నుండి 6 లక్షల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట. అదే విధంగా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ కి లక్ష నుండి 3 లక్షల వరకు తీసుకుంటుందని టాక్. ఇక టీవీ షోస్ కి ఒక్కో ఎపిసోడ్ కి 3 లక్షల రూపాయిలు ఛార్జ్ చేస్తుందట .
సుడిగాలి సుధీర్:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ప్రస్తుతం ఆయన ఒక పక్క సినిమాల్లో హీరో గా నటిస్తూనే , మరోపక్క బుల్లితెర టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రతీ వీకెండ్ లో టెలికాస్ట్ అయ్యే సరిగమప, ఫ్యామిలీ స్టార్స్ 2 ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కి సుధీర్ 2 నుండి 4 లక్షల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని టాక్.
ప్రదీప్ మాచిరాజు:
సుమ తర్వాత బుల్లితెర పై అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న యాంకర్స్ లిస్ట్ తీస్తే , అందులో ప్రదీప్ పేరు మొదటి స్థానం లో ఉంటుంది. ఎన్నో వందల టీవీ షోస్ చేసిన ఆయన , ప్రస్తుతం ‘ఢీ 21’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోస్ చేస్తున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కి ప్రదీప్ 1.5 లక్షల నుండి 3.5 లక్షల రూపాయిల వరకు డిమాండ్ చేస్తాడట. ఒకపక్క యాంకర్ గా చేస్తూనే , మరో పక్క సినిమాల్లో హీరో గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అనసూయ:
‘జబర్దస్త్’ ద్వారా వేరే లెవెల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సెలబ్రిటీలతో ఒకరు అనసూయ. ఒకప్పుడు జబర్దస్త్ అంటే అనసూయ మాత్రమే గుర్తుకొచ్చేది. ఆ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చిన అనసూయ, ఈమధ్య కాలం లో యాంకరింగ్ కి దూరంగా ఉంటూ , సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా ఫుల్ బిజీ అయ్యి పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయింది. అయితే ఆమె యాంకర్ గా చేసే రోజుల్లో ఒక్కో ఎపిసోడ్ కి 2 నుండి 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునేది అట.
శ్రీముఖి:
మొదట్లో చిన్న చిన్న షోస్ చేసుకుంటూ వచ్చిన యాంకర్ శ్రీముఖి , ఇప్పుడు స్టార్ మా ఛానల్ లో ఆస్థాన యాంకర్ గా మారిపోయింది. ‘బిగ్ బాస్ 3’ లో కంటెస్టెంట్ గా పాల్గొనప్పటి నుండి ఆమె తలరాత ఇలా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి నుండి స్టార్ మా ఛానల్ లో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈమె ఒక్కో ఎపిసోడ్ కి 2 నుండి మూడు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్.
రష్మీ గౌతమ్:
‘జబర్దస్త్’ కామెడీ షో అంటే మన అందరికీ గుర్తుకొచ్చే రెండు మూడు పేర్లలో రష్మీ పేరు కూడా ఒకటి. ఎన్నో ఏళ్ళ నుండి ఆమె ఈటీవీ లోనే షోస్ చేస్తూ వచ్చింది. జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్స్ వస్తున్నారు , పోతున్నారు , కానీ రష్మీ మాత్రమే ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు ఈటీవీ లో అత్యధిక షోస్ కి రష్మీ యాంకర్ గా చేస్తూ వచ్చేది , కానీ ఇప్పుడు కేవలం ‘జబర్దస్త్’ మాత్రమే చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కి ఈమె 2 నుండి 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటుందని టాక్.
ప్రస్తుతానికి టాప్ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ అందుకుంటున్న యాంకర్లు వీళ్ళే. ఈమధ్య ఛర్మిల వంటి యంగ్ యాంకర్స్ హవా కూడా గట్టిగా నడుస్తోంది . సోషల్ మీడియా లో బాగా పాపులర్ అవుతున్న ఇలాంటి యంగ్ యాంకర్స్ లక్ష రూపాయిల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?, మీకు బాగా ఇష్టమైన యాంకర్ ఎవరో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.