Hyper Aadhi: ఈటీవీ అంటే ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ ని చూసి , ఇతర చానెల్స్ లో కూడా అదే తరహా షోస్ ని డిజైన్ చేశారు. ఇక ‘ఢీ ‘ డ్యాన్స్ షో క్రియేట్ చేసిన ఇంప్యాక్ట్ మామూలుది కాదు. పటాస్ , పోవే పోరా వంటి షోస్ కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఈ షో 300 వ ఎపిసోడ్ మైలు రాయిని దాటింది. ముందుగా ఈ షోకి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత రష్మీ యాంకర్ గా వ్యవహరించింది , ఇప్పుడు ప్రదీప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు.
అయితే ఈ షో 300 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా , మేకర్స్ చాలా గ్రాండ్ గా ఈ ఎపిసోడ్ ని నిర్వహించారు. అందుకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రష్మీ, ఇంద్రజ వంటి వారు ఈ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రష్మీ ని చూడగానే ప్రదీప్ ‘హేయ్ రష్మీ..నువ్వు వస్తావని అసలు ఊహించలేదు’ అని అంటాడు. అప్పుడు రష్మీ ‘నేను కూడా నువ్వు నా ప్లేస్ లోకి వస్తావని ఊహించలేదు’ అని అంటుంది. అయితే ఈ షో కి రష్మీ పొట్టి దుస్తులు ధరించి వస్తుంది. దాన్ని చూసి హైపర్ ఆది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ లో నిన్ను ఎంత తగ్గిస్తే మాత్రం , నువ్వు ఇంత తగ్గిస్తావా’ అని ఆమె డ్రెస్ ని ఉద్దేశించి కామెంట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఇంద్రజ ఎంట్రీ ఇస్తుంది. ‘రావాల్సిన మనిషి వచ్చినందుకు ఆశ్చర్యపోతారేంటి , రాను అనుకున్నారా , రాలేనని అనుకున్నారా?’ అని అంటుంది. అప్పుడు హైపర్ ఆది ‘రానివ్వరని అనుకున్నాము’ అని పంచ్ వేయగా , రష్మిక ‘నోరు మూసుకో ఆది’ అని అంటుంది.
ఇక ఎపిసోడ్ చివర్లో హైపర్ ఆది , రష్మీ మధ్య జరిగిన ఒక ఎమోషనల్ మూమెంట్ ని చూస్తే , వీళ్లిద్దరి మధ్య ఇంత బంధం ఉందా అని అనిపిస్తోంది. హైపర్ ఆది మాట్లాడుతూ ‘ఈ షో కి ప్రదీప్ అన్న వచ్చినందుకు ఎంత ఆనందపడ్డానో , నువ్వు వెళ్ళిపోయినందుకు అంతే బాధ పడ్డాను’ అంటూ రష్మీ ని ఉద్దేశించి ఆది మాట్లాడిన మాటలు చాలా ఎమోషనల్ గా అనిపించాయి. హైపర్ ఆది ఇలా ఎమోషనల్ గా మాట్లాడడం చాలా అరుదు. ఒకటి రెండు సార్లు మాట్లాడాడు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ మాట్లాడుతున్నాడు. ఆద్యంతం ఎమోషనల్ మూమెంట్స్ తో , ఫన్నీ సంఘటనలతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ 300 వ ఎపిసోడ్ సాగినట్టు అనిపిస్తోంది. ఈ ఆదివారం ఈ షో అభిమానులకు పండగే అనొచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.