Mamitha Baiju: ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్స్ లో , అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి మమిత బైజు. మలయాళం లో ఈమె కెరీర్ ఆరంభం లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చేది. ఆ తర్వాత అక్కడ హీరోయిన్ గా మారి పలు సినిమాలు చేసింది కానీ , కేవలం కేరళ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఎప్పుడైతే ఈమె ‘ప్రేమలు’ చిత్రం చేసిందో , అప్పటి నుండే ఈమె జాతకం పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా మలయాళం లో మాత్రమే కాదు , తెలుగు , తమిళ భాషల్లో కూడా పెద్ద హిట్ అయ్యింది. దీంతో మమిత బైజు కి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. వరుసగా సినిమాలు చేస్తూ , హిట్టు మీద హిట్టు అందుకుంటూ ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్ళిపోయింది.
ఈ ఒక్క ఏడాది లోనే ఆమె హీరోయిన్ గా నటించిన 3 సినిమాలు చెరో 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. అంతే కాకుండా నటిగా మమిత బైజు రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాయి. సోషల్ మీడియా లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమెకు సంబంధించిన మీమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే గత రెండు మూడు రోజుల నుండి మమిత కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె గత కొంతకాలం నుండి ఒక టాలీవుడ్ యంగ్ హీరో తో ప్రేమాయణం నడుపుతుందని , రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి ఒక ప్రైవేట్ పార్టీ కి వెళ్లి రావడాన్ని ఒక ప్రముఖ మీడియా రిపోర్టర్ చూశారని, వీళ్లిద్దరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారని , ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
దీనిపై మమిత బైజు ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించేది నా సోదరుడు మిథున్ బైజు మాత్రమే. నేను, నా సోదరుడు స్నేహితులం కంటే ఎక్కువ. జీవితం లో నాకు సంబంధించిన ప్రతీ ముఖ్యమైన విషయంలో మిథున్ నిర్ణయమే ఫైనల్. నాకు వచ్చే లవ్ ప్రపోజల్స్ ని కూడా హ్యాండిల్ చేసేది అతనే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అభిమానులకు మమిత ఏమి చెప్పిందో అర్థం కాలేదు. యంగ్ హీరోని పెళ్లి చేసుకోబోతున్నాను అనే వార్తని ఆమె పూర్తి గా ఖండించలేదు , తన సోదరుడి నిర్ణయమే ఫైనల్ అంటుంది. అంటే దీని అర్థం ఏంటి?, ప్రస్తుతం తానూ ప్రేమలోనే ఉన్నాను , సోదరుడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పిందా?, లేదంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నా సోదరుడే నిర్ణయిస్తాడని చెప్పిందా? అంటూ ఆ పోస్ట్ క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.