Auto Ram Prasad: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించిన కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను , ఆటో రామ్ ప్రసాద్. ఈ ముగ్గురి కోసమే జబర్దస్త్ షో ని చూసే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ ని ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. ఎంతో స్నేహంగా ఉండే ఈ ముగ్గురు ఒక్కొక్కరుగా జబర్దస్త్ ని మానేస్తు రావడంతో ఆ షో బలం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రామ్ ప్రసాద్ కూడా జబర్దస్త్ ని వదిలి ‘బిగ్ బాస్ 10’ కి వెళ్లిపోవడం తో ఈ షోకి మరింత కల తగ్గింది. అయితే ఆయన ‘బిగ్ బాస్ 10’ కి వెళ్లే ముందు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది , గెటప్ శ్రీను లతో కలిసి చేసిన కామెడీ స్కిట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన రామ్ ప్రసాద్ కి గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్ సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది , ఆయన నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా సుధీర్ , గెటప్ శ్రీను ఇద్దరూ కూడా ఓటు వెయ్యమని తమ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ని అడుగుతారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పటి వరకు రామ్ ప్రసాద్ రెండు మూడు వారాలు నామినేషన్స్ లోకి వచ్చాడు. ఒక్కటంటే ఒక్క వారం లో కూడా సుధీర్ , గెటప్ శ్రీను తమ స్నేహితుడికి ఓటు వెయ్యండి అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేయలేదు. దీంతో స్నేహితులు అయ్యినప్పటికీ కూడా రామ్ ప్రసాద్ కి వీళ్లిద్దరు సపోర్ట్ చేయడం లేదు. ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వీళ్లిద్దరు రామ్ ప్రసాద్ కి సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి ? అని విశ్లేషకులు కొంతమంది ఆరా తీస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నప్పటికీ యాక్టీవ్ గా ఉండదు. చాలా అరుదుగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని ఉపయోగిస్తూ ఉంటాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియా లో ఉండదు కాబట్టే రామ్ ప్రసాద్ కి సపోర్టు చేస్తూ పోస్టులు , స్టోరీలు పెట్టలేదని అంటున్నారు. ఇక గెటప్ శ్రీను విషయానికి వస్తే , ఇతను సుధీర్ తో పోలిస్తే కాస్త యాక్టీవ్ గా సోషల్ మీడియా లో ఉంటాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్. ఈమధ్య కాలం లో ఈయన ఇన్ స్టాగ్రామ్ ని పెద్దగా ఉపయోగించలేదు. ఆ కారణం వల్లే రామ్ ప్రసాద్ కోసం పోస్టులు వేసి ఉండకపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.
ఎంత బిజీ గా ఉన్నప్పటికీ , సోషల్ మీడియా రెగ్యులర్ గా వాడనప్పటికీ , స్నేహితుడు కోసం ఒక్క పోస్టు వేస్తే ఏమి అవ్వుధి, ఇన్ని రోజుల స్నేహానికి విలువ లేదా?, వీళ్ళు జబర్దస్త్ లోకి వచ్చినప్పుడు స్నేహితులు కాలేదు , జబర్దస్త్ లోకి రాక ముందు నుండే స్నేహితులు. ఆ స్థాయి స్నేహం ఉన్నప్పుడు ఒక్కసారి సపోర్టు చేస్తున్నట్టు పోస్టులు పెడితే ఏమవ్వుది అని కొందరి వాదన. అయితే స్వయంగా రామ్ ప్రసాదే వీళ్ళిద్దరిని తన గురించి పోస్టులు వేయొద్దని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ ప్రసాద్ ప్రతీ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతూ రావడానికి అతని ఫ్యాన్స్ ఓట్లు సరిపోతుంది, సుధీర్ , గెటప్ శ్రీను వంటి వారు కూడా సపోర్టు చెయ్యమని పోస్టులు పెడితే, రామ్ ప్రసాద్ కి కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ పడుతుంది. అలాంటి ఓటింగ్ తనకు అవసరం లేదని , కేవలం తన ఆట తీరు ని బట్టీ ముందుకు వెళ్లాలని రామ్ ప్రసాద్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.