Anchor Srimukhi: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఏ రేంజ్ బజ్ తో ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పరిస్థితి చూస్తుంటే గత సీజన్ కంటే ఈ సీజన్ పెద్ద హిట్ అయ్యేలా అనిపిస్తోంది. అంతే కాదు సీజన్ 4 వైబ్స్ ని కూడా తీసుకొస్తుంది ఈ షో. సీజన్ 4 లో అభిజిత్ , అఖిల్ మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరిగాయో, ఈ సీజన్ లో రోహిత్ , త్రిగున్ మధ్య కూడా అలాంటి గొడవలే జరుగుతున్నాయి. రోహిత్ ని చూస్తుంటే అభిజిత్ ని చూస్తున్నట్టుగానే అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘బిగ్ బాస్ 3’ లో యాంకర్ శ్రీముఖి ఒక కంటెస్టెంట్ గా పాల్గొని మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘అగ్ని పరీక్ష’ ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి శ్రీముఖి, ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ ఆదివారం రోజున టెలికాస్ట్ అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కామెడీ షో కి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. గత నాలుగేళ్ల నుండి గ్యాప్ లేకుండా ఈ షో కొనసాగుతూనే ఉంది. అయితే నేటి ఎపిసోడ్ ని ‘మాన్సూన్ స్పెషల్’ గా తీర్చి దిద్దారు. ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి కమెడియన్ హరి పై పంచులు వేస్తూ ‘ఆఫ్ట్రాల్ బిగ్ బాస్ షో కి వెళ్లలేకపోయావ్ రా నువ్వు , నీకు అవసరమా అసలు’ అని అంటుంది.
ఇక్కడ ఆమె ఉద్దేశపూర్వకంగా అనకపోయినా కూడా ‘ఆఫ్ట్రాల్ బిగ్ బాస్’ అంటూ బిగ్ బాస్ ని తక్కువ చేసి మాట్లాడడం పై సోషల్ మీడియా లో ఆమెపై తీవ్రమైన విమర్శలు ఎదురయ్యేలా చేస్తున్నాయి. నీకు ఇంతటి లైఫ్ ఇచ్చిన బిగ్ బాస్ ని ఆఫ్ట్రాల్ అంటున్నావా?, యాంకర్ గా నీ కెరీర్ ఊహించని మలుపు తీసుకోవడానికి కారణం , ఈ ఆఫ్ట్రాల్ బిగ్ బాసే అంటూ ఆమెని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై శ్రీముఖి రెస్పాన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.