Homeఎంటర్టైన్మెంట్Megha family Vs Allu Family  : చిరంజీవి సినిమా ఫ్లాప్ అయ్యినందుకు సంబరాలు చేసుకున్న...

Megha family Vs Allu Family  : చిరంజీవి సినిమా ఫ్లాప్ అయ్యినందుకు సంబరాలు చేసుకున్న అల్లు ఫ్యామిలీ..సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ రచయిత!

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ 'ఆరోజు షూటింగ్ చేస్తున్న సమయంలో, అల్లు రామలింగయ్య గారు వచ్చారు. అప్పుడే చిరంజీవి గారి స్టేట్ రౌడీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని అల్లు రామలింగయ్యకి ఎవరో చెప్పారట. ఆ విషయాన్నీ ఆయన సెట్స్ లోకి వచ్చి స్టేట్ రౌడీ ఎగిరిపోయింది అంటూ పెద్ద అరుస్తూ ప్రచారాలు చేసాడు. దీనికి చిరంజీవి గారు చాలా బాధపడ్డారు

Megha family Vs Allu Family  : మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులను వేరువేరుగా ఒక మెగా అభిమాని చూడడం ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. ఒక మెగా అభిమాని చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఎంతగా అభిమానిస్తాడో, అల్లు అర్జున్ ని కూడా అంతే అభిమానిస్తాడు. కానీ అల్లు అర్జున్ కారణంగా ఇన్ని రోజులు కలిసి ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు రెండుగా విడిపోయేలాగా అనిపిస్తుంది. ఒకే కుటుంబం కదా చిన్న చిన్న గొడవలు ఉండడం సహజమే, భవిష్యత్తులో ఏ చిన్న సందర్భం వచ్చినా మళ్ళీ అందరూ కలిసిపోతారని నిన్నమొన్నటి వరకు అభిమానులు అనుకున్నారు. కానీ పరిస్థితులు వాటికి అనుకూలించడం లేదు. అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాల కి వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి కి సపోర్టు చెయ్యడం దగ్గర నుండి ఈ వివాదం మొదలైంది. అభిమానులు అప్పటి నుండి సోషల్ మీడియా లో గొడవలు పడుతూనే ఉన్నారు.

ఈమధ్యనే కాస్త తగ్గాయి అనుకుంటే, మొన్న .’మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆరిపోయిన మంటలను తన మాటలతో మళ్ళీ చెలరేగిపోయేలా చేసాడు. ఆ తర్వాత ఆయన మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి కూడా లైవ్ డిబేట్స్ కి వచ్చి, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడు. ఇక నేడు కాసేపటి క్రితమే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అల్లు అర్జున్ కి అభిమానులు ఉంటారని మీరు చెప్తేనే నాకు తెలిసిందని, ఆయన తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడు అంటూ తీవ్రమైన విమర్శలు చేసాడు. ఇదంతా పక్కన పెడితే పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో చిరంజీవి గారి మామయ్య అల్లు రామలింగయ్య , చిరంజీవి సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ఎలా స్పందించాడో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు షూటింగ్ చేస్తున్న సమయంలో, అల్లు రామలింగయ్య గారు వచ్చారు. అప్పుడే చిరంజీవి గారి స్టేట్ రౌడీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని అల్లు రామలింగయ్యకి ఎవరో చెప్పారట. ఆ విషయాన్నీ ఆయన సెట్స్ లోకి వచ్చి స్టేట్ రౌడీ ఎగిరిపోయింది అంటూ పెద్ద అరుస్తూ ప్రచారాలు చేసాడు. దీనికి చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. ఏంటి మా మామయ్య ఇలా అంటున్నాడు అంటూ విచారంగా ముఖం పెట్టాడు. అప్పుడే ఆ చిత్ర నిర్మాతలు చిరంజీవి గారిని కలిసి మొదటి వారంలో స్టేట్ రౌడీ చిత్రం రాబట్టిన వసూళ్లు, రికార్డ్స్ గురించి చెప్తూ అద్భుతంగా థియేటర్స్ లో ఆడుతుంది అని చెప్పారు. అది విన్న తర్వాత చిరంజీవి గారు కోపంగా అల్లు రామలింగయ్య గారి వైపు చూసారు. అప్పుడు ఆయన నాకేం తెలుసు, ఎవరో చెప్పారని, నేను ఇక్కడ చెప్పాను అని అన్నాడు’ అంటూ పరుచూరి గోపాల కృష్ణ గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper