Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి , మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కి మధ్య లింక్ ఏంటి?, అసలు వీళ్లిద్దరు రెండు ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కదా , వీళ్లకు లింక్ ఏంటి ?, అల్లు అర్జున్ రీసెంట్ గా అమెరికా కి వెళ్ళినప్పుడు ఒబామా ని ఏమైనా కలిశాడా ?, అందుకే ఇలాంటి హెడ్ లైన్ పెట్టారా?, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికే మీ మైండ్ లోకి వచ్చేసి ఉంటాయి. అసలు ఈ చర్చ కి దారి తీయడానికి ప్రధాన కారణం, అల్లు అర్జున్ ధరించిన వాచీ నే. పూర్తి వివరాల్లోకి వెళ్తే , అల్లు అర్జున్ తన సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి సమయం లో ఒక వాచీ ని ధరించాడు. దీని ధర కోట్లల్లోనో , లక్షల్లోనో ఉంటుందని అనుకుంటే పొరపాటే, అందుబాటు ధరలో , అత్యాధునిక ఫీచర్లతో , ఈ క్యాసియో వాచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ని సొంతం చేసుకుంది.
1989 వ సంవత్సరం లో మార్కెట్ లోకి వచ్చిన క్యాసియో వాచ్ ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి అట. రెసిన్ స్ట్రాప్ , స్టాప్ వాచ్ , అలారం, ఎక్కువ కాలం పని చేసే బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అల్లు అర్జున్ తో పాటు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఈ వాచీ ని ధరించాడట. ఇదే అల్లు అర్జున్ , బరాక్ ఒబామా కి మధ్య ఉన్నటువంటి లింక్. అదే విధంగా హాలీవుడ్ కి చెందిన ఎంతో మంది ప్రముఖ నటులు కూడా ఈ వాచ్ ని ధరించేవారాట. దీని ధర కేవలం 1295 రూపాయిలు మాత్రమే. 1989 వ విడుదలైనప్పటి డిజైన్ ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు , ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తో కలిసి ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ముంబై లో శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్, ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా పూర్తి అయ్యాక , అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభం లో ఈ సినిమా మొదలు కానుంది.