spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: మలయాళ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ రిటర్న్ గిఫ్ట్, అలా వారి రుణం...

Allu Arjun: మలయాళ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ రిటర్న్ గిఫ్ట్, అలా వారి రుణం తీర్చుకున్న పుష్పరాజ్!

Allu Arjun: పాట్నా, చెన్నై నగరాల్లో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి. తాజాగా కేరళలో కూడా పుష్ప 2 టీం ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. మలయాళ ప్రేక్షకులతో అల్లు అర్జున్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనను మలయాళ ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. అల్లు అర్జున్ కి కేరళలో అభిమాన సంఘాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయన ఫాలోయింగ్ ఏమిటో. అందుకే పాన్ ఇండియా హీరో ఇమేజ్ రాకముందే అల్లు అర్జున్ సినిమాలు కేరళలో మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేసేవారు.

ఇక కేరళలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకలో మలయాళ ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు అల్లు అర్జున్. వారికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ విధంగా తన ప్రేమ చాటుకున్నాడు. అదేమిటంటే.. ఒక పాట కొన్ని మలయాళ లిరిక్స్ తో కూడి ఉంటుందట. అన్ని భాషల్లో కూడా ఆ సాంగ్ లోని పర్టిక్యులర్ లిరిక్స్ మలయాళంలోనే ఉంటాయట. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మలయాళ అభిమానుల కోసం నేను ఏదైనా చేయాలని దేవిశ్రీ ప్రసాద్ ని అడిగాను. వారి కోసం ఒక సాంగ్ రూపొందిద్దాం అని దేవిశ్రీ అన్నారు.

ఒక పాటలో మలయాళ లిరిక్స్ ఉంటాయి. పుష్ప 2 ఆరు భాషల్లో విడుదల అవుతుంది. అన్ని భాషల్లో ఆ పాటలో సదరు లిరిక్స్ మలయాళంలోనే ఉంటాయి, మీ దత్తపుత్రుడు మీ కోసం ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఇది, అన్నారు. వేదిక మీద ఆ సాంగ్ ని ప్లే చేశారు. కాగా పుష్ప 2 మలయాళ వెర్షన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. మరోవైపు పుష్ప 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టాక్ కూడా బయటకు వచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.

భార్య శ్రీవల్లితో ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి అట. ఇక ఫహద్ ఫాజిల్ తో అల్లు అర్జున్ కాంబినేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. జాతరలో యాక్షన్ ఎపిసోడ్ మరో హైలెట్ అంటున్నారు. దేవిశ్రీ సాంగ్స్ సైతం మెప్పిస్తాయని సినిమా చూసిన వారి అభిప్రాయం. అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ కాపీ చూసిన అల్లు అరవింద్ సంతృప్తి చెందారట. మూవీ పెద్ద హిట్ అవుతుందని అన్నారట. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతున్న సంగతి తెలిసిందే..

RELATED ARTICLES

Most Popular