Allu Arjun: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక ఇలాంటి క్రమంలోనే పుష్ప సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కబోతోందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 30% షూటింగ్ కంప్లీట్ చేసినప్పటికి గ్రాఫిక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా మొత్తాన్ని హై టెక్నాలజీతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఐ బొమ్మ రవి దొరికిన తర్వాత అతనికి సపోర్ట్ చేస్తూ చాలామంది ప్రేక్షకులు మాట్లాడుతున్నారు.
దాంతో హీరోలు రెమ్యూనరేషన్స్ భారీగా పెంచడం వల్ల సినిమా బడ్జెట్ పెరుగుతోంది. తద్వారా సినిమా టికెట్ల రేట్ ను పెంచుతున్నారు. దానివల్ల సగటు ప్రేక్షకుల బాధ చూడలేక ఐ బొమ్మ రవి ఫ్రీగా ప్రేక్షకులకు సినిమాను అందించాలనే ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ని హ్యాక్ చేసి సినిమాలను చేస్తున్నాడు అంటూ కొంతమంది అతనికి సపోర్ట్ గా మాట్లాడుతుండడం చూసిన అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ ను చాలా వరకు తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది…
మా వల్లే ఇండస్ట్రీ బడ్జెట్ పెరుగుతుందని రియలైజ్ అయి తన పారితోషకాన్ని తగ్గించుకున్నాడట. ఇక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో పుష్ప సినిమా కోసం 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఈ సినిమాకి కేవలం 100 కోట్ల వరకే పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. మిగతాదంతా సినిమా మేకింగ్ మీద ఖర్చు పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇక తను నిజంగానే ఇలా చేస్తే ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి తను ఆదర్శంగా నిలుస్తాడు.. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించి తనకున్న క్రేజ్ ను పెంచుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ చేసింది నిజమే మిగతా హీరోలు కూడా అతని బాటలోనే నడిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…