Devara 2: ఎన్టీఆర్(Junior NTR) కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘దేవర'(Devara Movie). #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం, దానికి తోడు ఈ చిత్రం లోని ప్రతీ పాట వైల్డ్ ఫైర్ లాగ క్లిక్ అవ్వడం తో సినిమా పై ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు, లాంగ్ రన్ వసూళ్లు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ లాంగ్ రన్ ఉన్న సినిమా ఇదే అనొచ్చు. అయితే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. ఎన్టీఆర్ డ్యాన్స్, అనిరుద్ మ్యూజిక్ , జాన్వీ కపూర్ అందచందాలు మరియు కొన్ని సన్నివేశాలు క్లిక్ అవ్వడం తో ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
అయితే క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్నట్టుగా, సొంత కొడుకు ‘వర’ దేవర ని ఎందుకు చంపాడు?, అది తెలియాలంటే పార్ట్ 2 వరకు ఎదురు చూడండి అనే ట్విస్ట్ పెడుతాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ క్లిప్ హ్యాంగర్ ఆడియన్స్ కి అసలు ఎక్కలేదు, రెండవ పార్ట్ తీసేంత కథ అసలు లేదు, ఒకవేళ తీసినా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆడియన్స్ ని ఆతృతను గురి చేసే ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి. ఎన్టీఆర్ కి కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి లేదు, కానీ కొరటాల శివ పట్టుబట్టి ఆయన వెంట తిరుగుతూ, ఈసారి కథ మామూలుగా రాలేదు అని ఒప్పించే ప్రయత్నం చేసాడు. కొరటాల శివ ఇబ్బంది పెడుతుండేలోపు, వద్దు అని బలంగా ఎన్టీఆర్ చెప్పలేకపోయాడు కానీ, ‘వార్ 2’ ఫలితం తర్వాత ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ వద్దు అని చాలా గట్టిగ కొరటాల కి చెప్పినట్టు తెలుస్తోంది.
పైగా ‘దేవర’ చిత్రం కమర్షియల్ గా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా కాదు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన నాగవంశీ, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వసూళ్లను బయటకు రానివ్వకుండా చేసి, తానూ ఇచ్చిన కలెక్షన్స్ ని మాత్రమే ప్రముఖ సైట్స్ లో అప్లోడ్ అయ్యేలా చేసాడు. ఆయన ఇచ్చిన కలెక్షన్స్ లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు. కానీ వాస్తవానికి ఈ చిత్రం కేవలం 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇది బయ్యర్స్ కి, ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన వారికి తెలుసు. అందుకే ఫైనాన్షియర్స్ ఈ సినిమా సీక్వెల్ కి డబ్బులు పెట్టేందుకు ముందుకు రాకపోవడం ఈ చిత్రాన్ని అధికారికంగా ఆపేసినట్టు తెలుస్తోంది.