Allu Arjun Lokesh Kanagaraj: తెలుగు సినిమాలో వారసత్వం ఉన్నంత మాత్రాన సక్సెస్ లు రావు…కష్టపడి నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథల్ని ఎంచుకొని సినిమాలు చేసినప్పుడు మాత్రమే హీరోలు టాప్ హీరోలుగా మారుతారు…లేకపోతే మాత్రం షెడ్డికి వెళ్ళిపోవాల్సిందే…ప్రస్తుతం ఇండస్ట్రీ లో చాలా మంది టాప్ హీరోలుగా రాణిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు. తెలుగు హీరోగా తన కెరియర్ ను స్టార్ చేసిన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నాడు…ఇక అందులో భాగంగానే అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఒక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక లోకేష్ కనకరాజు అనగానే డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తూ ఉంటాడు.
ఆయన చేసిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు రొటీన్ కమర్షియల్ సినిమాలకు బిన్నంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి అందులో అన్ని సినిమాలను కలుపుతూ ఒక యూనివర్స్ లాగా క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగం అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా ఈ సినిమా పక్క డార్క్ రా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు సినిమాలో ప్రతి సీను కూడా హైలెట్ గా నిలుస్తుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా సీన్స్ ని క్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి అటు అల్లు అర్జున్ కి, ఇటు లోకేష్ కనకరాజ్ కి మంచి పేరు తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఆ రేంజ్ లోనే ఈ సినిమాలోని కాన్సెప్ట్ ఉండాలి. లేకపోతే మాత్రం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచే అవకాశమైతే ఉంది…