spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: హిందీలో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ "పుష్ప"... ఎంతంటే ?

Pushpa Movie: హిందీలో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ “పుష్ప”… ఎంతంటే ?

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మూడో వారంలోకి అడుగు పెట్టింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఈ చిత్రం నార్త్ ఇండియాలో సాధిస్తున్న వసూళ్లకు అక్కడి ట్రేడ్ పండిట్లు కూడా విస్తుబోతున్నారు. కాగా బాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ కావాల్సిన ‘జెర్సీ’ సినిమా వాయిదా పడటంతో ‘పుష్ప’ సినిమాకు మరింత కలిసొచ్చింది.

allu arjun pushpa movie collections create records in hindi

‘పుష్ప’ సినిమా సాధించిన వసూళ్లు చూసి బాలీవుడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. మూవీ విడుదలైన 16వ రోజు హిందీలో ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా రిలీజైన ఇన్ని రోజుల తర్వాత ఈ వసూళ్లు రావడం కష్టం. ఈ ఏడాది హిందీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సూర్యవంశీ’ 16వ రోజు రూ.3.77 కోట్ల గ్రాసే కలెక్ట్ చేసింది. అలాంటిది ఒక డబ్బింగ్ సినిమా ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇంకా ఆశ్చర్య పోవాల్సిన విశేషం ఏంటంటే… ఇప్పటిదాకా ‘పుష్ఫ’ ఒక్క రోజులో కలెక్ట్ చేసిన అత్యధిక మొత్తం కూడా ఇదే. మొత్తంగా శనివారం నాటికి ఈ చిత్రం హిందీలో రూ.57 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘జెర్సీ’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సైతం వాయిదా పడటంతో ‘పుష్ప’ డ్రీమ్ రన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగబోతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.75 కోట్ల గ్రాస్ మార్కును కూడా ఈజీగానే టచ్ చేసేలా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper