spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: నాకు అనిపించింది చేస్తా..నన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్...

Allu Arjun: నాకు అనిపించింది చేస్తా..నన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ కౌంటర్!

Allu Arjun: అల్లు,మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఏర్పడింది అనేది నిజమే అని రోజురోజుకి బలపడేలా చేస్తున్నాయి రీసెంట్ గా జరుగుతున్న కొన్ని సంఘటనలు. రామ్ చరణ్ ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టుకున్నప్పటి నుండి ఈ దూరం చిన్నగా పెరుగుతూ వచ్చిందని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో నడుస్తున్న చర్చ. ముఖ్యంగా అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ ని అసూయ పుట్టింది అనేది మెగా అభిమానుల వాదన. చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం నుండి మొదలైన ఈ గొడవని, తగ్గించుకొని పోదామనే ఆలోచన అల్లు అర్జున్ కి ఏమాత్రం ఉన్నట్టుగా లేదని అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజున, రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కి వెళ్తే, అల్లు అర్జున్ జనాల దృష్టిని మరలించడానికి వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లాడని, ఒకవేళ తన స్నేహితుడికి సపోర్ట్ చేసుకోవాలి అని అనిపిస్తే కచ్చితంగా చేసుకోవచ్చని, కానీ అల్లు అర్జున్ ఉద్దేశ్యం వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానుల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన విషయం అల్లు అర్జున్ కి తెలుసు, అయినా కానీ ఆయన దానిని చల్లార్చే పనులు చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచినందుకు మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిన రోజున అల్లు అర్జున్ మరియు ఆయన కుటుంబం ఉద్దేశపూర్వకంగానే దూరం హాజరు కాలేదని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ చెప్తున్న మాట. ఇకపోతే నిన్న అల్లు అర్జున్ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్ కి ప్రాణ స్నేహితుడు, అలాగే వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే చిత్రం చేస్తున్నారు. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గా ఆయన విచ్చేశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నాకు ఇష్టమైన వారిని , నా స్నేహితులను ఎప్పుడూ మర్చిపోను.

వాళ్ళ కోసం కచ్చితంగా ఎక్కడిదాకా అయినా వెళ్తా’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్తాడు. అంత ఎమోషనల్ గా చెప్పింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించే అని సోషల్ మీడియా లో అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి అని ఆశపడిన అభిమానులకు ఇప్పుడు చుక్కెదురు అయ్యింది. ఈ రెండు కుటుంబాలు ఇప్పట్లో కలిసేలా లేవు అని అందరికీ అర్థం అయిపోయింది. భవిష్యత్తు లో ఈ సమస్య ఇంకా పెరిగి పెద్దది అవుతుందా లేదా సర్దుకుంటుందా అనేది చూడాలి. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సోషల్ మీడియా వాతావరణం ఇప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్ కారణంగా హీట్ ఎక్కింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper