spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. కీలక ప్రకటన చేసిన...

AP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. కీలక ప్రకటన చేసిన సీఎం

AP Mega DSC  : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి. ఈ సమయంలో ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే పెడతానని ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. 2024 జూన్‌ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డీఎస్సీ(DSC) ఫైల్‌పై సంతకం కూడా చేశారు. పది నలలు గడిచాయి నోటిఫికేషన్‌ మాత్రం రాలేదు. దీంతో నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఈతరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్‌ మొదటి వారంలో(APril First Week) మెగా డీఎస్సీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించారు. ఈ నోటిఫికేషన్‌(Notification)ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియను జూన్‌ నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు పూర్తి చేసి, నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్చి 25, సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read : 75% హాజరు తప్పనిసరి, కఠిన నిబంధనలతో విద్యార్థులకు సవాల్‌

ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా లేదు..
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని, నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిందని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశానని, ఇప్పుడు దానిని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(SGT), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT), స్కూల్‌ అసిస్టెంట్స్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను నిర్వహించి, అవకతవకలకు తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

చిగురించిన ఆశలు..
ఈ ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే, కొందరు ఆకాంక్షితులు ఎక్స్‌ వేదికగా తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లోనే పరీక్షలు నిర్వహిస్తే తమపై ఒత్తిడి పెరుగుతుందని, పరీక్షలను జూలై లేదా ఆగస్టు నెలలో నిర్వహించాలని కోరుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ, ఎన్నికల కోడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read : ‘ఈనాడు’ పై మారుతున్న టిడిపి అభిప్రాయం.. ఎమ్మెల్యేల హెచ్చరికలు!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Oktelugu Epaper