Digital Payments
Digital Payments : భారత్‌లో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గడిచిన మార్చి నెలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, గతేడాది జనవరి నుంచి నవంబర్ వరకు ్ఖ్కఐ ద్వారా 15,547 కోట్ల లావాదేవీలు జరిగాయి, వీటి విలువ రూ. 223 లక్షల కోట్లు. డిసెంబర్ 2024లో UPI లావాదేవీలు 16.73 బిలియన్లకు చేరుకుని, రూ. 23.25 లక్షల కోట్ల విలువతో ఆల్–టైమ్ రికార్డు సష్టించాయి. ఈ గణాంకాలు UPI భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎంతగా పాతుకుపోయిందో సూచిస్తున్నాయి.
Also Read : నగదు రహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న భారత్.. చరిత్ర తెలిస్తే గూస్ బంప్స్ పక్కా..!
మార్చిలో సరికొత్త రికార్డు..
ఇక మార్చి 2025లో కూడా ఈ ఊపు కొనసాగిందని, లావాదేవీల సంఖ్య మరియు విలువలో గణనీయమైన వృద్ధి నమోదైందని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. జనవరి 2025లో UPI లావాదేవీలు 16.99 బిలియన్లకు చేరుకుని, రూ. 23.48 లక్షల కోట్ల విలువతో ఒక మైలురాయిని అధిగమించాయి. మార్చిలో ఈ సంఖ్య మరింత పెరిగి, సుమారు 17 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా. ఈ వృద్ధి భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌ను సామాన్య ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో చూపిస్తుంది.
2024లో ఇలా..
2024లో మొత్తం 172 బిలియన్ లావాదేవీలు జరగగా, 2023తో పోలిస్తే ఇది 46% వృద్ధిని సూచిస్తుంది. విలువ పరంగా రూ.247 లక్షల కోట్లతో 35% పెరుగుదల నమోదైంది. ్ఖ్కఐ యొక్క ఈ విజయం వెనుక సాధారణత, భద్రత, 24/7 అందుబాటు వంటి అంశాలు ఉన్నాయి. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, కిరాణా దుకాణాలు సైతం UPI విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా UPIఏడు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది, ఇందులో ఫ్రాన్స్(France), యూఏఈ(UAE), సింగపూర్(Singapur) వంటి దేశాలు ఉన్నాయి.
50 శాతం వృద్ధి..
అయితే, ఈ వృద్ధి సైబర్ మోసాలను కూడా పెంచింది. UPI ద్వారా జరిగే సైబర్ నేరాలు 50% వరకు పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, NPCI కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఏప్రిల్ 1, 2025 నుంచి న్యూమరిక్ UPI లపై కొత్త మార్గదర్శకాలు, భద్రతా చర్యలు అమల్లోకి వస్తాయి. డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్నప్పటికీ, సైబర్ భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. UPI ద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఈ మార్పు దేశ పురోగతికి ఒక సానుకూల సంకేతం.
Also Read : 12 ఏళ్లు.. 90 రెట్లు.. డిజిటల్ లావాదేవీల్లో మనమే తోపు!
Web Title: Digital payments india sets new record march 2025
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com