spot_img
Homeసినిమా వార్తలుఆస్కార్ అవార్డు రేసులో ‘జాతిర‌త్నాలు’!

ఆస్కార్ అవార్డు రేసులో ‘జాతిర‌త్నాలు’!

Jathi Ratnalu
న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి.. ఈ ముగ్గురి కాంబోలో వ‌చ్చిన జాతి ర‌త్నాలు సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిందో అంద‌రికీ తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం కొల్ల‌గొట్టిన క‌లెక్ష‌న్లు చూసి అంద‌రూ నోరెళ్ల బెట్టారు. ఓవ‌ర్సీస్ లో మిలియ‌న్ డార్లు సాధించి.. క‌రోనా త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ముక్కోణ‌పు పోటీలో విడుద‌లైన ఈ చిత్రానికి.. మిగిలిన రెండూ తేలిపోవ‌డంతో ఎదురే లేకుండాపోయింది. గాలిసంప‌త్ డిజాస్ట‌ర్ గా మిగిలిపోగా.. శ్రీకారం యావ‌రేజ్ మూవీగా మిగిలిపోయింది. దీంతో జాతిరత్నాలు దూసుకెళ్లింది. ఆ త‌ర్వాత వారం వ‌చ్చిన మూడు చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో జాతిర‌త్నాల పంట పండింది. కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టింది.

అయితే.. ఓ లేటెస్ట్ న్యూస్ ఆడియ‌న్స్ ను నివ్వెర‌ప‌రిచింది. ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింద‌ని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. బెస్ట్ జానే జిగర్ కేట‌గిరీలో అవార్డుకు ఈ మూవీ నామినేట్ అయ్యింద‌ని ప్ర‌క‌టించింది. దీంతో.. సోష‌ల్ మీడియాలో ఈ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకునే అర్హ‌త‌ ఖ‌చ్చితంగా ఉందంటూ కొంద‌రు కామెంట్ చేశారు.

మ‌రికొందరు మాత్రం.. ఈ మ‌ధ్య‌నే ఆస్కార్ అవార్డులు ప్ర‌క‌టించ‌గా.. ఇప్పుడు నామినేష‌న్లు ఏంటీ? అని అనుమానం వ్య‌క్తంచేశారు. అయితే.. వీరి అనుమాన‌మే నిజ‌మైంది. ఆడియ‌న్స్ ను ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఈ పోస్టును పెట్టిన‌ట్టు త‌ర్వాత తేలింది. దీంతో.. అంద‌రూ న‌వ్వేసుకున్నారు. ఇప్ప‌టికీ సినిమా ప్ర‌మోష‌న్ కొన‌సాగిస్తున్న యూనిట్ ను చూసి ‘వాట్ ఆన్ ఐడియా గురూ!’ అంటున్నారు నెటిజన్లు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper