Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి... పోటీ మామూలుగా...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో ఒకరికొకరు విపరీతంగా హెల్ప్ చేసుకున్నప్పటికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఉన్నప్పటికి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోల మధ్య విపరీతమైన పోటీ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒకరు ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అంతకుమించిన సక్సెస్ ను […]

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో ఒకరికొకరు విపరీతంగా హెల్ప్ చేసుకున్నప్పటికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఉన్నప్పటికి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోల మధ్య విపరీతమైన పోటీ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒకరు ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అంతకుమించిన సక్సెస్ ను సాధించాలని మరొక హీరో ఆరాట పడుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ లాంటి హీరో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. దాంతో తన స్నేహితుడు అయిన నవీన్ పోలిశెట్టి సైతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. విజయ్ కి సైతం 100 కోట్ల మార్కెట్ ఉంది. కానీ ప్రస్తుతం విజయ్ ప్లాపుల్లో ఉన్నాడు. నవీన్ పోలిశెట్టి సక్సెస్ లో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు హీరోలు 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక ఆ తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైతం రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక నవీన్ పోలిశెట్టి సైతం ఇప్పుడు భారీ బడ్జెట్ తో ఒక సినిమానైతే చేయబోతున్నాడు.

మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సన్నివేశాలతో ఉన్న సినిమాని తను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ ను డామినేట్ చేస్తూ నవీన్ పోలిశెట్టి ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి విజయ్ తనని తాను ప్రూవ్ చేసుకుంటూ నవీన్ పోలిశెట్టి కి గట్టి పోటీని ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరు సక్సెస్ ఫుల్ హీరోగా నిలుస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper