Homeఎంటర్టైన్మెంట్Unknown Facts: టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే!

Unknown Facts: టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే!

Unknown Facts: సినీ సెలబ్రిటీలంతా డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు , వీళ్లకు వందల కోట్ల ఆస్తులు ఉంటాయి , లగ్జరీ లైఫ్ ఉంటుంది , బ్రతికితే అలా బ్రతకాలి అని మన లాంటి సామాన్యులు అనుకుంటూ ఉంటారు. అత్యధిక శాతం ఇందులో నిజముంది. కానీ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉంటూ , ఇప్పటి వరకు తమకంటూ ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయిన హీరోలు చాలా మంది ఉన్నారనే విషయం మీకు […]

Unknown Facts: సినీ సెలబ్రిటీలంతా డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు , వీళ్లకు వందల కోట్ల ఆస్తులు ఉంటాయి , లగ్జరీ లైఫ్ ఉంటుంది , బ్రతికితే అలా బ్రతకాలి అని మన లాంటి సామాన్యులు అనుకుంటూ ఉంటారు. అత్యధిక శాతం ఇందులో నిజముంది. కానీ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉంటూ , ఇప్పటి వరకు తమకంటూ ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయిన హీరోలు చాలా మంది ఉన్నారనే విషయం మీకు తెలుసా?, అవును మీరు వింటున్నది నిజమే. అలాంటి హీరోల గురించే ముందుగా మనం మాట్లాడుకోబోతున్నాము.

ఈ లిస్ట్ లో అందరికంటే ముందు వరుస లో ఉండే హీరో ఆర్ నారాయణ మూర్తి. కమ్యూనిస్ట్ భావాలతో ఈయన చేసే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కొన్ని చిత్రాలు సెన్సేషనల్ సూపర్ హిట్స్ గా నిలిచి, భారీ వసూళ్లను రాబట్టాయి. అత్యధిక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా , తానే నిర్మాతగా మారి , తన భావజాలను వెండితెర పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఆర్ నారాయణ మూర్తి. తనకంటూ కొంత డబ్బుని సంపాదించుకోగలిగాడు కానీ, ఇప్పటి వరకు ఈయన ఇంటిని నిర్మించుకోలేకపోయాడు. ఈయన అమీర్ పేట్ మామూలు హాస్టల్స్ లో ఉంటున్నాడు అనే టాక్ కూడా ఉంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అంతటి దయనీయమైన పరిస్థితి లో లేనని, నాకున్న డబ్బుతో బాగానే నివసిస్తున్నానని చెప్పాడు. కానీ తనకంటూ ఒక సొంత ఇల్లు ఉందని మాత్రం చెప్పలేకపోయాడు.

ఇక సొంత ఇల్లు లేని మరో హీరో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే , మనం రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకోవాలి. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం తో హీరో గా మారిన ఈయన , ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా గుర్తింపు తెచ్చుకున్న రోజుల్లో ఇతను ఒక మంచి ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. కానీ అది తన మాజీ ప్రేయసి లావణ్య కి ఇచ్చి వెళ్ళిపోయాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమ ఇంటిని తిరిగి ఇచ్చేయాలంటూ లావణ్య ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి విజయాలు లేవు, నిర్మాతలు ఆయనకు కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు , కొంతమంది నిర్మాతలు అయితే పూర్తిగా రెమ్యూనరేషన్ ఎగ్గొడుతున్నారు. ఆర్ధిక పరిస్థితి బాగా క్షీణించడం తో ప్రస్తుతం ఆయన అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు.

ఇక సొంత ఇల్లు లేని మూడవ హీరో నవీన్ పోలిశెట్టి. ఇతని కెరీర్ జీరో నుండి మొదలై నేడు ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక యూట్యూబర్ గా మొదలై , టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 8 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు, అయినప్పటికీ కూడా సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం. వీళ్ళతో పాటు సంతోష్ శోభన్ కి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు నిర్మించలేదట. వీళ్ళ తండ్రి శోభన్ ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే ఒక ఇంటిని నిర్మించాడు. అప్పటి నుండి సంతోష్ శోభన్ , సంగీత్ శోభన్ ఆ ఇంట్లో ఉంటూ వస్తున్నారు కానీ, వీళ్లకంటూ ప్రత్యేకమైన ఇంటిని నిర్మించుకోలేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న తర్వాత తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకుంటారో లేదో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ కూడా ఒకానొక దశలో అపార్ట్మెంట్స్ లో అద్దె ఫ్లాట్ లో ఉండాల్సి వచ్చింది అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. తన అన్నయ్య నాగబాబు నష్టాల్లో ఉన్నప్పుడు , సొంత ఇంటిని అమ్మేసి, సమీపం లోని ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాడు. అక్కడే రెండు మూడేళ్లు ఉన్నాడట కూడా. ఇప్పుడు ఆయనకు ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంది అనుకోండి , అది వేరే విషయం. అంత పెద్ద సూపర్ స్టార్ కి కూడా అలాంటి పరిస్థితి కొంతకాలం సాగింది అని చెప్పడమే మా ఉద్దేశ్యం.

ఒకప్పుడు లెజెండ్స్ గా కొనసాగిన ఎంతో మంది హీరోలు కొన్ని సందర్భాల్లో తమ ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటి లెజెండ్స్ లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ఈయన నిర్మాతల హీరో అని అందరూ అంటుంటారు. తన సినిమా ఒకేవేళ ఫ్లాప్ అయితే, నిర్మాతకు మరో సినిమా ఉచితంగా చేసి పెట్టేవాడు. అంతే కాకుండా ఫైనాన్స్ కూడా ఇప్పించేవాడు. హిట్ అయ్యినప్పుడు మాత్రం నిర్మాతలు పెద్దగా డబ్బులు ఇచ్చేవారు కాదు. అంతే కాకుండా రిస్క్ చేసి నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కూడా. అలా భారీ ఫ్లాప్స్ గా నిల్చిన సినిమాల కారణంగా కృష్ణ తాను ఎంతో ఇష్టం గా కట్టుకున్న ‘పద్మాలయ స్టూడియోస్’ ని మూసివేయాల్సి వచ్చింది. అంతే కాకుండా తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ లో పెద్ద హీరో గా స్థిరపడేంత వరకు కృష్ణ చాలా కష్టాలను ఎదురుకున్నాడని అంటుంటారు సినీ పెద్దలు. ఇలా సినీ హీరోలకు కూడా కష్టాలు ఉంటాయి , వాళ్ళు కూడా మన లాగానే అనేది అర్థం చేసుకోవాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper