Tata Aeris : టాటా మోటార్స్ నుంచి మరో కొత్త కాంపాక్ట్ సెడాన్ మార్కెట్‌లోకి రాబోతోంది. ఇప్పటికే ఉన్న టిగోర్ సెడాన్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా, కొత్త పేరుతో టాటా ఏరిస్ (Tata Aeris)ను కంపెనీ పరిచయం చేయనుంది. సెప్టెంబర్ 25న ఈ మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్న నేపథ్యంలో.. తాజాగా ఏరిస్ ఐ-సీఎన్‌జీ వేరియంట్ ఎలాంటి కవరింగ్ లేకుండా డీలర్‌షిప్ వద్ద కనిపించింది. దీంతో ఇప్పటివరకు టీజర్ల ద్వారా మాత్రమే వెల్లడైన కారు డిజైన్ పూర్తిగా బయటపడింది.
మారిన ఫ్రంట్ డిజైన్
టాటా ఏరిస్‌లో ముందు భాగంలో గణనీయమైన మార్పులు చేశారు. కొత్త క్లామ్‌షెల్ బానెట్, రిఫ్లెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్లోస్ బ్లాక్ అప్లికే వంటి అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. బంపర్‌పై సీ-ఆకారపు డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి టియాగోలో కనిపించే వర్టికల్ బార్ డిజైన్‌కు భిన్నంగా ఉంటాయి.
కారు వెనుక భాగంలో కూడా పలు మార్పులు చేశారు. కూపే తరహాలో కనిపించే స్లోపింగ్ రూఫ్‌లైన్ రియర్ రూఫ్ స్పాయిలర్‌తో కలుస్తుంది. ఇందులో హై-మౌంటెడ్ ఎల్‌ఈడీ స్టాప్ ల్యాంప్ ఉంది. షార్క్-ఫిన్ యాంటెన్నా, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త రియర్ బంపర్ వంటి మార్పులు ఏరిస్ లుక్‌ను మరింత ఆధునికంగా మార్చాయి.
ఫీచర్లలోనూ అప్‌డేట్స్
డీలర్‌షిప్‌లో కనిపించిన కారు బేస్ లేదా లోయర్ ట్రిమ్ కావడంతో కొన్ని ఫీచర్లు ఇందులో కనిపించలేదు. అయితే టాప్ వేరియంట్లలో హెడ్‌ల్యాంప్‌లలోనే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ రిబ్స్, అల్లాయ్ వీల్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యాష్‌క్యామ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఇంటీరియర్‌లో ఫ్యాబ్రిక్-వ్రాప్డ్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కొనసాగనుంది. 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కొత్తగా మరింత వెడల్పైన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.
ఐ-సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా?
డీలర్‌షిప్‌లో కనిపించిన ఏరిస్ ఐ-సీఎన్‌జీ మోడల్ కావడంతో పవర్‌ట్రెయిన్‌పై కూడా ఆసక్తి నెలకొంది. టిగోర్‌లో ఉన్న డ్యూయల్-సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కొత్త ఏరిస్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. సీఎన్‌జీ స్టార్ట్ ఫంక్షన్, రీఇన్‌ఫోర్స్‌డ్ రియర్ సస్పెన్షన్ వంటి ప్రత్యేక అంశాలు కూడా కొనసాగవచ్చని అంచనా.
పెట్రోల్ వెర్షన్‌లో టిగోర్‌లో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, మూడు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుత టిగోర్ ఐ-సీఎన్‌జీ గరిష్ఠంగా 28.06 కిమీ/కేజీ మైలేజీని అందిస్తుంది. భవిష్యత్తులో ఏరిస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా టాటా మోటార్స్ తీసుకురావచ్చని సమాచారం.
టాటా ఏరిస్ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి సబ్-ఫోర్-మీటర్ సెడాన్లతో పోటీ పడనుంది. అధికారిక లాంచ్ తర్వాత ధర, వేరియంట్లు, పూర్తి ఫీచర్లపై స్పష్టత రానుంది.