HomeజాతీయంTata Group: అంబానీ, అదానీ కోసం టాటాను తొక్కేస్తున్న మోడీ.. ఏంది రాహుల్ ఇది..

Tata Group: అంబానీ, అదానీ కోసం టాటాను తొక్కేస్తున్న మోడీ.. ఏంది రాహుల్ ఇది..

Tata Group:ఇండియన్ ఇండస్ట్రీ సెగ్మెంట్లో.. కీలకమైన అనేక కంపెనీలు ఉన్నాయి. అందులో టాటాకు కీలక స్థానం ఉంటుంది. మిగతా కంపెనీల మాదిరిగా టాటా ఉండదు. టాటా కంపెనీ మొదటి నుంచి దేశ ప్రయోజనాల లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది. రతన్ కన్నుమూసిన తర్వాత ఈ గ్రూపులో అంతర్గత పోరు మొదలైంది. వాస్తవానికి ఇది ఆ కంపెనీకి సంబంధించింది. కానీ ఇందులో రాహుల్ ఎంట్రీ ఇచ్చారు. దానికి నరేంద్ర మోడీ కారణమంటూ ముడిపెట్టారు. రతన్ టాటా గతించిన తర్వాత.. లక్షల […]

Tata Group:ఇండియన్ ఇండస్ట్రీ సెగ్మెంట్లో.. కీలకమైన అనేక కంపెనీలు ఉన్నాయి. అందులో టాటాకు కీలక స్థానం ఉంటుంది. మిగతా కంపెనీల మాదిరిగా టాటా ఉండదు. టాటా కంపెనీ మొదటి నుంచి దేశ ప్రయోజనాల లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది. రతన్ కన్నుమూసిన తర్వాత ఈ గ్రూపులో అంతర్గత పోరు మొదలైంది. వాస్తవానికి ఇది ఆ కంపెనీకి సంబంధించింది. కానీ ఇందులో రాహుల్ ఎంట్రీ ఇచ్చారు. దానికి నరేంద్ర మోడీ కారణమంటూ ముడిపెట్టారు.

రతన్ టాటా గతించిన తర్వాత.. లక్షల కోట్ల ఆస్తుల విషయంలో టాటా వారసుల మధ్య పంచాయతీ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆ పంచాయతీని తట్టుకోలేక చంద్రశేఖరన్ బయటికి వచ్చారు. దీంతో అసలు వివాదం ఏంటో తెలిసిపోయింది. ఆ తర్వాత అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి కార్పొరేట్ కంపెనీలలో జరిగే పంచాయితీలు తేలవు. లక్షల కోట్ల ఆస్తులు.. విపరీతమైన ఈగోలు కార్పొరేట్లను ఒక పట్టాన కాంప్రమైజ్ కానివ్వవు. అక్కడిదాకా ఎందుకు రిలయన్స్ లో గతంలో ఏం జరిగింది.. చాలా రోజులపాటు చర్చలు జరిగాయి కదా. అసలు ఏం జరిగిందో బయటికి రాలేదు కదా.. అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా.. అంటే రిలయన్స్ మధ్య గొడవ జరగడానికి కాంగ్రెస్ పార్టీ కారణమా.. ఇలాంటి మాట అంటే నోటితో నవ్వరు. కానీ ఈ సోయి ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి లేకుండా పోయింది.

టాటా గ్రూపులో జరుగుతున్న పంచాయతీకి నరేంద్ర మోడీ కారణమట. అంబానికి.. ఆదానికి సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ టాటా కంపెనీ మొత్తాన్ని బొంద పెట్టడానికి నిర్ణయించుకున్నారట.. ఒకవేళ నరేంద్ర మోడీ అలా చేయాలి అనుకుంటే.. ఈ భారత దేశంలో ఆదాని.. అంబానీ కంపెనీలు మాత్రమే ఉండాలి కదా.. ఎవడు అమెరికా వాడు అదాని గ్రూప్ మీద కేసు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమని ఆరోపించింది.. దీని వెనక మోడీ ఉన్నాడు అని.. తిట్టి పోసింది. అదాని గ్రూప్ మీద కేసులు కొట్టివేయగానే సైలెంట్ అయిపోయింది. పైగా ఇప్పుడు కొత్త పల్లవి ఏమందుకున్నదంటే.. టాటా గ్రూపులో నరేంద్ర మోడీ వేలు పెట్టారని.. అందులో పంచాయతీలకు కారణమవుతున్నారని ఆరోపించడం ప్రారంభించింది. కానీ రేపు పొద్దున ఇదే టాటా కంపెనీ నరేంద్ర మోడీకి జై కొడుతుంది. నరేంద్ర మోడీ కి నమస్కరిస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతుంది.. రాహుల్ గాంధీ ఎలాంటి సమాధానం చెప్పగలరు.. పాపం రాహుల్ గాంధీ పీఆర్ టీం ను మార్చుకోవాల్సిందే.. లేకుంటే ప్రతిసారి ఇలా జాతీయ మీడియాలో పడి బొక్క బోర్లా పడుతుంటే ఆ పార్టీ పరిస్థితి మరింత దిజారిపోతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper