Homeబిజినెస్Microsoft: 24 గంటలు..42 లక్షల కోట్లు.. కుబేరుడి వల్ల కూడా కాదు ఇది

Microsoft: 24 గంటలు..42 లక్షల కోట్లు.. కుబేరుడి వల్ల కూడా కాదు ఇది

Microsoft: పురాణాల్లో ఆగర్భ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు కుబేరుడు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన అప్పు కూడా ఇచ్చారు. డబ్బు సంపాదించే విషయంలో.. దర్పాన్ని ప్రదర్శించే విషయంలో చాలామంది కుబేరుడిని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పటి కలియుగంలో కుబేరుడు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ వ్యక్తి డబ్బు సంపాదించాడు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాల 42 లక్షల కోట్లు.. అది కూడా 24 గంటల వ్యవధిలో.. ఇంత […]

Microsoft: పురాణాల్లో ఆగర్భ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు కుబేరుడు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన అప్పు కూడా ఇచ్చారు. డబ్బు సంపాదించే విషయంలో.. దర్పాన్ని ప్రదర్శించే విషయంలో చాలామంది కుబేరుడిని ప్రస్తావిస్తూ ఉంటారు.

ఇప్పటి కలియుగంలో కుబేరుడు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ వ్యక్తి డబ్బు సంపాదించాడు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాల 42 లక్షల కోట్లు.. అది కూడా 24 గంటల వ్యవధిలో.. ఇంత డబ్బు సంపాదించిన ఆ వ్యక్తి ఏం చేస్తాడు.. ఎటువంటి వ్యాపారాలు కొనసాగిస్తాడు.. ఈ అంశాలపై ప్రత్యేక కథనం..

టెక్నాలజీ దిగ్గజంగా పేరు తెచ్చుకుంది మైక్రోసాఫ్ట్. ఈ కంపెనీకి వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. ఇతడు ఒక రోజులోనే దాదాపు 42 లక్షల కోట్ల సంపాదన సంపాదించాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీ చరిత్రలో ఒకేరోజు ఈ స్థాయిలో విలువ పెరగడం ఇదే తొలిసారి. అయితే ఈయన కంపెనీ విలువ ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

గడచిన సంవత్సరం ఏప్రిల్ లో ట్రంప్ ప్రపంచ దేశాల మీద సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే వాటిని అమలులోకి తీసుకురావడానికి 90 రోజులపాటు గా గడువు విధించారు. నాడు ఎన్విడియా కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆ చిప్ కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజు ట్రేడింగ్ లోనే దాదాపు 440 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది. వాస్తవానికి ప్రపంచ మార్కెట్ చరిత్రలోనే ఈ కంపెనీ పేరు మీద అద్భుతమైన రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కూడా మైక్రోసాఫ్ట్ సింపుల్ గా క్రాస్ చేసి పడేసింది. మార్కెట్ చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్కు సృష్టించింది. ఈ లాభం ద్వారా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఏకంగా 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.

ఇదే ఊపులో మైక్రోసాఫ్ట్ తన క్వార్టర్ ఫలితాలను వెల్లడించింది. అజ్యూర్ క్లౌడ్ విభాగం లో ఉన్న ఆదాయం ఏకంగా 43% పెరిగింది. ఏఐ అసిస్టెంట్ మైక్రోసాఫ్ట్ 365 కో పైలట్ కు కూడా విపరీతంగా ఆదరణ వస్తుంది. దీని యూజర్ల సంఖ్య కూడా మూడు కోట్లు దాటిపోయింది. ఫలితంగా మైక్రోసాఫ్ట్ షేర్ల ధర 16% లాభాన్ని నమోదు చేశాయి. ఈ స్థాయిలో మైక్రోసాఫ్ట్ విలువ పెరగడం 2008 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ షేర్ విలువ ఈ స్థాయిలో పెరిగితే.. ప్రముఖ ఐటీ కంపెనీ మెటా షేర్లు ఏకంగా 8% డౌన్ అయ్యాయి . ఈ కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా దారుణంగా ఉన్నాయి.. అయితే మెటా కంపెనీ ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉంది. అందువల్లే ఆ కంపెనీ షేర్ల ధరలు తగ్గాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper