Homeఆంధ్రప్రదేశ్‌YCP: జూనియర్ ఎన్టీఆర్ ను వదలని వైసిపి

YCP: జూనియర్ ఎన్టీఆర్ ను వదలని వైసిపి

YCP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉపయోగించుకుంటుంది. ఆయన ద్వారా రాజకీయం చేయాలని భావించి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. లోకేష్ ను ప్రోత్సహించేందుకే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేసారని కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి వారితో ఆరోపణలు చేయించింది కానీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గడిపేస్తోంది. మెగా కుటుంబంలో అల్లు అర్జున్ ను వేరు చేసి రాజకీయం చేసింది. గత ఎన్నికలకు ముందు.. తరువాత అదే పని చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేక ప్రచారం కల్పించేందుకు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు అల్లు అర్జున్ పేర్లు ఉపయోగించుకుని రాజకీయం చేయాలనుకుంది. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి.

* లోకేష్ ప్రకటనతో..
ప్రస్తుతం అంబటి రాంబాబు( ambati Rambabu) అరెస్ట్ ఎపిసోడ్ నడుస్తోంది. చంద్రబాబును నడిరోడ్డుపై దూషించారు అంబటి రాంబాబు. విమర్శలు చేయవచ్చు కానీ అడ్డదిడ్డంగా తిప్పేసారు. బూతులు మాట్లాడారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వరకు అందరూ కామెంట్స్ చేస్తున్నారు. శాసనమండలిలో మంత్రి లోకేష్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును విడిచి పెట్టే ఛాన్స్ లేదని తేల్చేశారు. ఇకనుంచి ఏ తల్లిని అవమానించినా ఇలానే వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. అయితే దానిని పట్టుకుని ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తోంది. తద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకం అని ప్రమోట్ చేసే పనిలో పడింది.

* ఆ ఎమ్మెల్యే మాటలు తెరపైకి..
జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) విషయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది వివాదం రేగడంతో సదరు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు పిలిచి మాట్లాడారు. క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లోకేష్ తాజా ప్రకటనతో.. నాడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తే ఎక్కడికి వెళ్ళిపోయారంటూ వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రశ్నించారు. అయితే అప్పటితో ఆ వివాదం ముగిసింది కానీ.. ఇప్పుడు అదే పనిగా పాత ఆడియోను వైరల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ హవా పెరుగుతోంది. దానిని అడ్డుకట్ట వేసే పనిలో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది ఎంత మాత్రం వర్కౌట్ కాదని విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper