Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసిపి హింసకు.. యాంటి డోస్ వేయాల్సిందే..

YCP: వైసిపి హింసకు.. యాంటి డోస్ వేయాల్సిందే..

YCP: ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఏ ముహూర్తంలో అయితే కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందో.. అప్పటినుంచి పరిణామాలు వేరే విధంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని వైసిపి నాయకులు విచ్చలవిడిగా విమర్శలు చేస్తున్నారు. పైగా రప్పా రప్పా భాషను ఉపయోగిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేయడానికి బదులు.. భయాన్ని.. ఆందోళనను వ్యాప్తి చేయడమే వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. మిథున్ రెడ్డి చేసిన దాడి ద్వారా ఈ ఆధారాలు క్షేత్రస్థాయిలో కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. […]

YCP: ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఏ ముహూర్తంలో అయితే కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందో.. అప్పటినుంచి పరిణామాలు వేరే విధంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని వైసిపి నాయకులు విచ్చలవిడిగా విమర్శలు చేస్తున్నారు. పైగా రప్పా రప్పా భాషను ఉపయోగిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేయడానికి బదులు.. భయాన్ని.. ఆందోళనను వ్యాప్తి చేయడమే వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. మిథున్ రెడ్డి చేసిన దాడి ద్వారా ఈ ఆధారాలు క్షేత్రస్థాయిలో కళ్ళకు కట్టినట్టు కనిపించాయి.

కుప్పంలో వైసిపి ఇన్చార్జి.. ఎమ్మెల్సీ భరత్.. చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగిస్తున్నాయి. మా కార్యకర్తలు చంపడానికి లేదా చావడానికి అయినా సిద్ధమని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సాక్షి మీడియాలో రాలేదు. కాకపోతే మిగతా మీడియా సంస్థలు వైసిపికి జేబు సంస్థలు కావు కాబట్టి.. భరత్ వ్యాఖ్యలను ప్రసారం చేశాయి. ప్రచురించాయి. భరత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైసీపీ స్టాండ్ ఏమిటో అందరికీ అర్థమైంది. సీమవ్యాప్తంగా ఆందోళనలు కలిగించి.. భయాన్ని నెలకొల్పి.. రాజకీయంగా ఉనికిని చాటుకోవాలి అనేది వైసిపి నాయకుల ప్రణాళిక. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం రెచ్చిపోయింది. నామినేషన్లు వేస్తే నరుకుతామంటూ హెచ్చరించింది. ఇక పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద మిథున్ రెడ్డి రౌడీ మూకలతో వ్యవహరించిన తీరు అందరికీ కళ్ళ ముందు కనిపించింది.

వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీమలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. పాతకాలపు రౌడీముకల రాజ్యం.. భయానక వాతావరణం ఇప్పుడు తగ్గిపోతుంది. ప్రజలు.. స్థానిక నాయకులు భయాన్ని వదిలిపెడుతున్నారు. అందువల్లే వైసీపీ నాయకుల హింసాత్మక ప్రణాళిక రాయలసీమలో అంతగా వర్కౌట్ కావడం లేదు. గతంలో ఉన్న పరిస్థితిని మళ్లీ చూపించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో వర్కౌట్ కావడం లేదు. వైసీపీ రూపొందిస్తున్న ఈ కుట్ర కోణాన్ని తిప్పి కొట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లా అండ్ ఆర్డర్ ను అమలు పెట్టి.. ఎక్కడికక్కడ పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. అధికారంలో ఉన్నామని ఆవేశపడకుండా.. తీవ్రమైన ప్రతిదాడులు చేయకుండా.. కేవలం వ్యవస్థకు అనుగుణంగా యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తోంది. వైసీపీ నేతలు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే ఆలస్యం.. పోలీసుల రంగంలోకి దిగుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నారు. వాటిని రికార్డు చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒక రకంగా చట్ట ప్రకారం తాటతీస్తూ.. వైసీపీ నేతలను దెబ్బ కొడుతున్నారు.

పుంగనూరులో పెద్దిరెడ్డి మీద రెడ్డి చేసిన తొక్కించే రాజకీయం డ్రోన్ కెమెరాలలో నిక్షిప్తమైంది. దాడులు చేసేందుకు ఎలా వచ్చారో.. అందులో ఉన్న ఆయుధాలు.. మద్యం సీసాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. వాస్తవానికి ఇలా డ్రోన్లతో దృశ్యాలను చిత్రీకరిస్తున్నారని మిథున్ రెడ్డి వర్గానికి తెలియలేదు. కానీ ఆ విజువల్స్ బయటికి రావడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. వైసిపి ఎత్తులు తెలుసు కాబట్టి పోలీసులు పకడ్బందీగా ఇటువంటి సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఎక్కడ వివాదం సృష్టించాలని వైసీపీ నాయకులు అనుకున్నా.. వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. కేసులు విపరీతంగా నమోదు కావడం.. కోర్టులు.. న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అగత్యం ఏర్పడడంతో.. పార్టీ జెండా పట్టుకోవడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రావడం లేదు.

వాస్తవానికి పెద్ద స్థాయి నాయకులు అధికారం లేకపోవడంతో ఆవేశపడుతున్నారు. కింది స్థాయి కార్యకర్తల్లో ఉద్రేకాన్ని పెంపొందిస్తున్నారు. ఆవేశంలో కార్యకర్తలు ఏదైనా తప్పు చేస్తే రేపటి రోజున లీగల్గా ఇబ్బందులు ఎదురైతే.. కాపాడేందుకు ఏ నాయకుడు కూడా ముందుకు రాడు.. ఇప్పటికే అనేకమంది కార్యకర్తలకు ఇది వాస్తవంలోకి వచ్చింది. మరి ఇప్పటికైనా మిగతా కార్యకర్తలు దీనిని గుర్తుంచుకుంటారా.. పెద్ద స్థాయి నాయకులు చేసే ఆవేశ ప్రసంగాలకు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటారా.. అనేది ఆలోచించుకోవాలని కూటమి నాయకులు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ హింసకు యాంటి డోస్ వేయాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper