Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: ఇప్పుడున్న వైసీపీ బ్యాచ్ బ్యాగులు సర్దుకోవాల్సిందే.. ఆ చానల్లో ఇంకా ఏం జరగనుంది..

YSRCP: ఇప్పుడున్న వైసీపీ బ్యాచ్ బ్యాగులు సర్దుకోవాల్సిందే.. ఆ చానల్లో ఇంకా ఏం జరగనుంది..

YSRCP: అమెరికాకు జలుబు వస్తే ప్రపంచానికి జ్వరం వస్తుంది అంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఆ ఛానల్ లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. కాకపోతే ఈసారి గట్టిగానే ఆ ఛానల్ లో ప్రకంపనలు ఉన్నాయి.. అవి ఎంతటి స్థాయిలో ఉన్నాయంటే.. గతంలో ఆ చానల్లో పని చేసిన పెద్ద తలకాయలను వెళ్లిపొమ్మని మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసిందట. అక్కడితోనే ఆగడం లేదు వచ్చే రెండు నెలల కాలంలో ఇంకా చాలా మార్పులకు […]

YSRCP: అమెరికాకు జలుబు వస్తే ప్రపంచానికి జ్వరం వస్తుంది అంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఆ ఛానల్ లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. కాకపోతే ఈసారి గట్టిగానే ఆ ఛానల్ లో ప్రకంపనలు ఉన్నాయి.. అవి ఎంతటి స్థాయిలో ఉన్నాయంటే.. గతంలో ఆ చానల్లో పని చేసిన పెద్ద తలకాయలను వెళ్లిపొమ్మని మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసిందట. అక్కడితోనే ఆగడం లేదు వచ్చే రెండు నెలల కాలంలో ఇంకా చాలా మార్పులకు మేనేజ్మెంట్ శ్రీకారం చుట్టబోతోందట.

గతంలో ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఛానల్ లో పనిచేసిన పెద్ద తలకాయలు టిడిపి మీద దారుణంగా విష ప్రచారం చేశారు. కొన్ని సందర్భాలలో టిడిపి మీద లేనిపోని ఆ బాండాలు వేశారు. పైగా నాడు జగన్ అండ చూసుకొని విర్రవీగిపోయారు. తాడు బొంగరం లేని స్కిల్ కేసులో చంద్రబాబు దోషి అన్నట్టుగా వార్త కథనాలను ప్రసారం చేశారు. కానీ, చివరికి న్యాయం గెలిచింది. ధర్మం నిలిచింది. చంద్రబాబుకు సాంత్వన లభించింది. ప్రజా తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. తన దివ్యమైన పరిపాలన అందిస్తున్నారు.

ఆన్ న్యూస్ ఛానల్ లో వైసీపీ అనుకూల వ్యక్తులు ఉండడం ఆ మేనేజ్మెంట్ కు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఒక ఛానల్ నిర్వహించాలంటే భారీగా డబ్బు అవసరం పడుతుంది. పైగా మీడియా వ్యాపారంలో అంతా వైట్ మనీ రాదు. తెర వెనుక లావాదేవీల ద్వారానే నిధులు సమకూర్చుకోవాలి. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి. విస్తరణ పనులు కూడా చేపట్టాలి. ఇదంతా జరగాలంటే కంటగింపుగా ఉండిపోయిన వ్యక్తులను తొలగిస్తేనే బాగుంటుందని ఆ మేనేజ్మెంట్ నిర్ణయానికి వచ్చింది . అందువల్లే వైసీపీకి భజన చేసే వారందరినీ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ ఛానల్ కి అనుబంధంగా ప్రసారాలు చేసే మరో ఛానల్ లో కూడా వైసిపి అనుకూల వ్యక్తులు బయటికి వెళ్లి పోవాలని సూచించింది.

ఇప్పటికే ఆ చానల్లోకి సుప్రసిద్ధ జర్నలిస్ట్ కుమారుడు వచ్చారు. ఆయనకు రెసిడెంట్ ఎడిటర్ హోదా ఇచ్చారు. ఇప్పటికే ఆయన కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఆయనకు గతంలో టిడిపిలో కీలక శాఖలలో పనిచేసిన అనుభవం ఉంది. అందువల్లే ఆయనకు ఈ పోస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఇప్పటివరకు ఆ ఛానల్ కి పెద్ద తలకాయ లాగా.. వైసిపికి నోట్లో నాలుకలాగా వ్యవహరించిన వ్యక్తి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయనకు పొమ్మనలేక పొగ పెట్టడం ప్రారంభించారని.. త్వరలోనే ఆయన పోస్ట్ ఊస్ట్ అవుతుందని పాత్రికేయ సర్కిల్ లో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇటీవల ఒక వైసీపీ నేతను ఆ ఛానల్ లో పనిచేసే పెద్ద తలకాయ ఇంటర్వ్యూ చేసింది. తన శైలికి భిన్నంగా ఆ వైసిపి నేతను చెడుగుడు ఆడుకుంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో.. ఆ పెద్ద తలకాయ కు ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఇంత జరుగుతున్న నేపథ్యంలో పొరపాటున గతంలో పనిచేసి.. అవమానకరంగా వెళ్ళిపోయిన మాజీ పెద్ద తలకాయ మళ్ళీ ఛానల్లోకి వస్తే.. కథ మొత్తం వేరే విధంగా ఉంటుంది. అప్పుడు బ్రేకింగ్ న్యూస్ మొత్తం ఆ ఛానల్ గురించి వేయాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper