Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: వైసీపీని లేపే పనిలో కుహనా మేధావులు!

YSRCP: వైసీపీని లేపే పనిలో కుహనా మేధావులు!

YSRCP: ఏపీ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీని గట్టెక్కించడానికి కొంతమంది చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నంతకాలం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అందరికీ తెలుసు. అందుకే కూటమిలో విభేదాల కోసం కుహనా మేధావులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మేధావుల ముసుగులో వారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్, ఫ్లేవర్ కనిపిస్తోంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టిడిపిని తాత్కాలిక భాగస్వామిగా.. జగన్మోహన్ రెడ్డిని సుదీర్ఘకాలం స్నేహితుడిగా అమిత్ షా పవన్ కళ్యాణ్ తో అన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది. దానిని వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా ప్రొజెక్టు చేస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

* జగన్ కు అనుకూలం
ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది. అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుంది. కొద్ది రోజుల కిందట జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారట.. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరారట.. అందుకు అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించారట.. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని చెప్పారట.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడట.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారట.. అదే విషయాన్ని కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తో చెప్పించారట.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. దానిపై వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

* క్లాస్ పీకితే పవన్ ఊరుకుంటారా..
ఒక్క మాట అనుకుందాం. అమిత్ షా కేంద్ర హోం మంత్రి కావచ్చు. బిజెపిలో నెంబర్ 2 కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం. ఒకరితో క్లాస్ పీకించే పరిస్థితి ఉండదు. అంతవరకు రానివ్వరు కూడా. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు విశ్లేషణ చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన భావనగా చెప్పవచ్చు. కూటమిలో విచ్ఛిన్నం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం గా భావించవచ్చు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. అర్జెంటుగా ఇప్పుడు టిడిపితో జనసేన విడిపోవాలి. బిజెపి సహకారం అందకూడదు. ఇప్పుడు అదే భావనతో ఈ కుహనా మేధావులు రంగంలోకి దిగుతున్నారు. అయితే గతం మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారి విశ్లేషణను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. సమకాలీన రాజకీయ అంశాలపై లోతైన విశ్లేషణ ఆయన చేయవచ్చు కానీ.. ఎవరి భావజాలం ఎలా ఉంటుందో.. ప్రజలు ఇట్టే పసిగట్టేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ.. దానికి సోషల్ మీడియాలో ఇస్తున్న హైప్ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీని వెనుక ఉన్న పరమార్ధాన్ని గ్రహిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Oktelugu Epaper