YSRCP Journalist Comments : ఏపీలో( Andhra Pradesh) రాజకీయం మరోసారి వేడెక్కింది. అమరావతి మహిళల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల జర్నలిస్టు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కూడా సాక్షి మీడియా డిబేట్లో. అమరావతి ప్రాంతంలో ఎక్కువ మంది వేశ్యలు ఉన్నారంటూ కృష్ణంరాజు అనే జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీనిపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని మంత్రులు సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో సదరు జర్నలిస్టు కృష్ణంరాజు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అందులో కూడా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే సాక్షి మీడియాలో ఇటువంటి వ్యాఖ్యలు రావడంతో అమరావతి రైతులు ఆగ్రహంగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేయిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
Also Read : తల్లికి వందనం రెడీ.. చంద్రబాబు కామెంట్స్!
* సాక్షి టీవీ డిబేట్లో..
అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానులు అంటూ ఎన్నికలకు వెళ్ళిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల స్టాండ్ మారిందని.. తప్పకుండా మార్చుకుంటామని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చెప్పుకొచ్చారు. మరోవైపు ఆ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ అమరావతిని నిర్లక్ష్యం చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం అని వ్యాఖ్యానించారు. అదే రోజు సాక్షి టీవీలో డిబేట్ పెట్టగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల జర్నలిస్టుగా పేరుందిన కృష్ణంరాజు అమరావతిని వేశ్యల రాజధానిగా పోల్చడం.. దానికి సాక్షి కార్యక్రమ నిర్వాహకుడు కొమ్మినేని శ్రీనివాసరావు సమర్ధించడంతో అమరావతి రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కృష్ణంరాజు తో పాటు కొమ్మినేని ఫోటోలకు చెప్పులతో కొడుతూ మహిళలు నిరసనలు తెలిపారు. అటువంటి నారా లోకేష్ నుంచి ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు.
* తన వ్యాఖ్యలు సమర్ధించుకుంటూ వీడియో..
అయితే ఈ ఘటన పెను దుమారానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు( journalist Krishnam Raju) వైసీపీకి చెందిన జగనన్న కనెక్ట్స్ అనే సోషల్ మీడియా వేదికగా శనివారం వీడియో విడుదల చేశారు. కనీసం అందులో మహిళా రైతులను క్షమాపణ కోరే ప్రయత్నం చేయలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి పై ట్రోల్స్ చేస్తున్నారని.. అది పద్ధతి కాదంటూ వైసీపీ నేతగా మాట్లాడారు. సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న కేంద్ర గణాంకాలనే తాను చెప్పినట్లు సమర్థించుకున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని మాత్రమే తాను అన్నానని.. అమరావతిలో అనలేదు అని ఆ వీడియోలో పేర్కొన్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో అధికారులను అడిగితే చెబుతారు అంటూ.. తన వ్యాఖ్యల్లో తప్పు లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు కృష్ణంరాజు. అయితే కృష్ణంరాజు పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
జగన్ రెడ్డి గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై… pic.twitter.com/9ZWemoJ0fD
— Bangalore TDP Forum (@BangaloreTDP) June 7, 2025