Homeఆంధ్రప్రదేశ్‌Chintada Ravi: చింతాడ రవి ఎక్కడ.. కొందరి పోలీసుల సహకారంతోనే ఎస్కేప్

Chintada Ravi: చింతాడ రవి ఎక్కడ.. కొందరి పోలీసుల సహకారంతోనే ఎస్కేప్

Chintada Ravi: ఆమె ఒక మహిళ ఎస్ఐ. అంతమంది జనం ఉండగా.. ఒక దుశాసనపర్వం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. తాకరాని చోట తాకారు. పాపం ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటుందో.. ఆమెను ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే సీఐ.. ఇతర కానిస్టేబుళ్లు అడ్డగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంతటి దుశ్శాసనపర్వం జరగడానికి ప్రధాన కారణం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైసిపి ఇన్చార్జి చింతాడ రవి. ఆ పార్టీకి […]

Chintada Ravi: ఆమె ఒక మహిళ ఎస్ఐ. అంతమంది జనం ఉండగా.. ఒక దుశాసనపర్వం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. తాకరాని చోట తాకారు. పాపం ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటుందో..

ఆమెను ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే సీఐ.. ఇతర కానిస్టేబుళ్లు అడ్డగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంతటి దుశ్శాసనపర్వం జరగడానికి ప్రధాన కారణం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైసిపి ఇన్చార్జి చింతాడ రవి. ఆ పార్టీకి తగ్గట్టుగానే చింతాడ రవి వ్యవహారం ఉంటుంది.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చింతాడ రవి ఆముదాల వలస నియోజకవర్గంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. భూ దందాలకు పాల్పడ్డారు. బెదిరింపులకు దిగేవారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారు. ప్రత్యర్థుల మీద దాడులకు పాల్పడేవారు. ఆయన మీద అనేక రకాలుగా కేసులు ఉన్నాయి. నాడు అధికారం మదంతో విర్ర వీగేవారు. అధికారుల మీద ఓతులు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ప్రవళిక అనే మహిళ ఎస్సై మీద ఏ స్థాయిలో దారుణానికి పాల్పడ్డాడో ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది.

వ్యవహారాన్ని మాజీ పోలీసు అధికారి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఇతర అధికారులు తీవ్రంగా తప్పుపట్టారు. అయినప్పటికీ ఏపీ పోలీసులు ఇప్పటికీ రవిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. సాక్షాత్తు ఒక మహిళ ఎస్సై మీద దాడి పాల్పడినప్పటికీ.. ఆ దాడికి పాల్పడిన వ్యక్తి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోవడం విశేషం. చింతాడ రవిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు.. దీని వెనుక ఉన్న జాప్యం ఏమిటి.. అనే ప్రశ్నలు ఏపీ ప్రజల్లో కలుగుతున్నాయి. ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఇప్పటి రోజుల్లో.. ఒక వ్యక్తిని పట్టుకోలేకపోవడం పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో కూడా ఏపీ పోలీసులు కొందరి నేతల విషయంలో ఉదారత చూపించారు. స్వామి భక్తిని ప్రదర్శించారు. వారికి ముందస్తు బెయిల్ వచ్చే విధంగా కృషి చేశారు. ఇప్పుడు రవి విషయంలో కూడా అదే జరుగుతుందని సమాచారం. రవి చట్టపరంగా అనేక రకాల మినహాయింపులు పొందడానికి వీలుగా పోలీసులే కావాలని సమయం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. చింతాడ రవిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఎందుకు ఈ స్థాయిలో జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదు. పైగా కొందరు పోలీసు అధికారులు వైసీపీ నాయకులకు అండగా ఉంటున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అందువల్లే చింతాడ రవి లాంటి నాయకులు రెచ్చిపోతున్నారని.. చివరికి వారు పారిపోవడానికి కొందరు పోలీసులు తెరవెనక సహకారం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper