HomeతెలంగాణTelangana Cabinet Expansion Vijayashanti: రాములమ్మను పక్కనపడేశారే.. కోమటిరెడ్డిని పట్టించుకోలే.. లొల్లి మొదలైతదా?

Telangana Cabinet Expansion Vijayashanti: రాములమ్మను పక్కనపడేశారే.. కోమటిరెడ్డిని పట్టించుకోలే.. లొల్లి మొదలైతదా?

Telangana Cabinet Expansion Vijayashanti: సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అమాత్య స్థానం లభించలేదు. రాములమ్మకు మంత్రదండం సాధ్యం కాలేదు. మొత్తంగా అధిష్టానం ఎవరినైతే ఫిక్స్ చేసిందో వారికి మాత్రమే పదవులు వచ్చాయి. పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారికి రిక్త హస్తాలే మిగిలాయి.

Also Read: ప్రభాస్ ని నేను బావ అని పిలుస్తుంటాను..అతను లేకుంటే కన్నప్ప లేదు – మోహన్ బాబు

కాంగ్రెస్ పార్టీలో సిఫారసు రాజకీయాలకు కొదవ ఉండదు. గ్రూపు రాజకీయాలకు అడ్డు ఉండదు. అలాంటి చోట కేబినెట్ విస్తరణలో ఆశావాహులకు కాకుండా పైరవీకారులకు పదవులు లభిస్తాయని అంచనా ఉన్నది. మీడియాకు కొన్ని పేర్లు లీక్ చేసినప్పటికీ.. వారికి పదవులు లభిస్తాయనే స్పష్టత లేదు.. వాస్తవానికి కేబినెట్ విస్తరణ జరుగుతుందని ఎప్పటి నుంచో ప్రచారం మొదలైంది. దీనిపై అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లి వచ్చారు. పార్టీ పెద్దలను కలిశారు. కొన్నిసార్లు ఆయన ఒక్కరు మాత్రమే వెళ్లారు. ఇక అనేక సందర్భాలలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్ వంటి వారు వెళ్లారు. ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి హస్తిన వెళ్లిన తర్వాత చివరికి.. మంత్రివర్గం విస్తరణ పై ఒక క్లారిటీ వచ్చింది.

శ్రీహరి ముదిరాజ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవులు లభించాయి. బిసి, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం పట్టుదలతో ఉండడంతో.. సిఫారసులకు లెక్కలేకుండా పోయింది. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతికి అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగింది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి కే సి వేణుగోపాల్ రెడ్డి నుంచి అండదండలు ఉన్నాయి. విజయశాంతికి ఏసిసి అధ్యక్షుడి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురికి పదవులు రాకపోవడం విశేషం. వీరు ముగ్గురు కూడా మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వీరు మాత్రమే కాదు అద్దంకి దయాకర్ కూడా మంత్రి అవతారని ప్రచారం జరిగింది. అద్దంకి దయాకర్ అనుచరులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కూడా చేశారు. కాని చివరికి అధిష్టానం తాము అనుకున్న వారికి మాత్రమే పదవులు ఇచ్చింది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్థానిక నాయకత్వం.. ఆ ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చినట్టు పేర్కొంది. ఇక డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి రావడం విశేషం. ఆయన తొలిసారిగా డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రి దగ్గర పరపతి ఎక్కువ ఉండడంతో.. చివరికి ఉపసభాపతి పోస్టును సాధించారు. తాజాగా ప్రకటించిన మంత్రి వర్గంలో కరీంనగర్ జిల్లా చెందిన ఒక నాయకుడికి పదవి లభించింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ నుంచి ముగ్గురు నాయకులకు మంత్రి పదవులు లభించడం విశేషం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులుగా కొనసాగుతున్నారు.. ఇప్పుడు ఈ జాబితాలోకి కరీంనగర్ జిల్లా నాయకులు కూడా చేరిపోయారు. కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, ప్రభాకర్ తో పాటు లక్ష్మణ్ కు కూడా మంత్రి పదవులు లభించడంతో.. ఖమ్మం తోపాటు కరీంనగర్ కూడా ముగ్గురు మంత్రులతో కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular