Senior Journalist Comments: పాత్రికేయులు న్యూట్రాలిటీ కొనసాగించేవారు కాబట్టి.. ప్రభుత్వ అధికారుల కంటే వారికే విపరీతమైన గౌరవం ఉండేది. పైగా ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ అధికారుల కంటే ముందుగానే పాత్రికేయులకు ప్రజలు చెప్పుకునేవారు. వారి ద్వారా తమ సమస్య వెలుగులోకి వస్తే పరిష్కారం అవుతుందని భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పాత్రికేయులు న్యూట్రాలిటీ కోల్పోయారు. రాజకీయ పార్టీలకంటే ఎక్కువగా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ కండువాలు భుజాల మీద మోస్తున్నారు. న్యూట్రాలిటీ అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రత్యక్షంగానే ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా రాజకీయ పార్టీలకు గులాం గిరి చేసుకుంటూ.. కార్యకర్తలను మించి పోతున్నారు. ఈ జాబితాలో ఈ ఛానల్, ఆ పత్రిక అని తేడా లేదు. అన్ని కూడా ఆ తానులో ముక్కలే. తమకు నచ్చిన పార్టీకి.. తమకు నచ్చిన నాయకుడికి జేజేలు పలుకుతూ.. తమకు గిట్టని పార్టీపై.. తమకు గిట్టని నాయకుడిపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు..
తాజాగా సాక్షి మీడియాలో ఒక డిబేట్ ప్రసారమైంది. సాధారణంగా వైసిపి మౌత్ పీస్ లో ప్రసారమయ్యే డిబేట్ ను సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు కొనసాగిస్తుంటారు. సాక్షి అంటే తెలుసు కదా.. అది వైసిపి మౌత్ పీస్. వైసిపి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో.. సాక్షిలో ఆ తరహా వార్తలు ప్రసారమవుతుంటాయి. జగన్ తన పొలిటికల్ మైలేజ్ కోసమే సాక్షినిపెట్టాడు. తనకు నచ్చని నాయకులను తిట్టడానికే సాక్షిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు జర్నలిజం మొత్తం అలానే అయిపోయింది కాబట్టి దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఒక్క సాక్షిలోనే ఇలా లేదు.. మిగతా మీడియా సంస్థల్లో మొత్తం పరిస్థితి ఇలానే ఉంది. అయితే అధికార పార్టీకి.. లేకుంటే ప్రతిపక్ష పార్టీకి ఊడిగం చేయడం పరిపాటిగా మారిపోయింది.
సాక్షిలో ప్రసారమైన ఆ డిబేట్లో కృష్ణంరాజు అనే ఓ జర్నలిస్టు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో అతడు ఎలాంటి ఆరోపణలు చేసినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ అతడు ఎప్పుడైతే అమరావతిని పక్కనపెట్టి.. అమరావతి ప్రాంతంలో ఉండే మహిళలను కించపరచినట్టు మాట్లాడాడో.. రాయడానికి వీల్లేని భాషలో విమర్శలు చేశాడో.. అప్పుడే ఆ డిబేట్ దారి తప్పింది.. ఇక నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వం అనుకూల మీడియా సాక్షిపై విరుచుకుపడుతోంది. ఓ ఛానల్ లో పనిచేసే జర్నలిస్ట్ అయితే ఏకపక్ష సంభోదనతో విరుచుకుపడ్డాడు. ఆయన ఆ చానల్లో ప్రైమ్ టైం డిబేట్ నిర్వహిస్తుంటారు. సాధారణంగానే వైసీపీ అంటే మండిపడే ఆయన.. సాక్షిలో ప్రసారమైన డిబేట్ పై అంతెత్తున లేచారు. ఆ డిబేట్ నిర్వహించిన వ్యక్తిపై.. అమరావతి మహిళలపై విమర్శలు చేసిన వ్యక్తిపై ఒంటి కాలు మీద లేచారు. చివరికి సెన్సార్ అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోయి బూతులు కూడా మాట్లాడారు. వాస్తవానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక వర్గానికి ఆనందంగా ఉండవచ్చు గాని.. కృష్ణంరాజు స్థాయికి పడిపోయి సదరు సీనియర్ జర్నలిస్టు కూడా వ్యాఖ్యలు చేయడం అసలైన విషాదం. అప్పుడు ఆయనకు ఈయనకు తేడా ఏమిటనేది కాలమే చెప్పాలేమో.. అన్నట్టు ఆ చానల్ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది.
గత ఐదేళ్లుగా ఇదే పని చేస్తున్నావు కదా వెంకీ !! pic.twitter.com/0pYsF1SHes
— Samosa Times (@Samotimes2026) June 7, 2025