YS Jagan: కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో విభేదించి.. తన తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో.. జగన్ వైఎస్ఆర్ సీపీ పేరుతో ఒక పార్టీ పెట్టారు. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో తన తల్లితో కూడా పోటీ చేయించి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రతిపక్ష హోదానూ పొందలేకపోయారు 2024 ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. సొంతంగా పార్టీ పెట్టుకున్న జగన్.. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు మొత్తం తన వైపు మళ్ళించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్.. దళిత ఓటు ఆంధ్రప్రదేశ్లో మెరుగ్గా ఉంటుంది. జగన్ పార్టీ పెట్టడం.. కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో అందరూ ఫ్యాన్ పార్టీకి జై కొట్టారు.
2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో కేసుల నుంచి ఉపశమనం పొందడానికి బిజెపి పెద్దలకు జగన్ జై కొట్టారు. ప్రతి బిల్లుకు ఆమోదం తెలిపారు. చివరికి ఇటీవల కూడా కేంద్రం తీసుకొచ్చిన కొన్ని బిల్లుల విషయంలో వైసిపి ఆమోదం తెలపడం విశేషం. ఢిల్లీలో మారిపోతున్న పరిణామాలు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీ అధినేత రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ల వరకు బిజెపికి జై కొట్టిన ఆయన.. ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతోంది.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో జగన్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ .. ఇటు వైఎస్ఆర్సిపి ఖండించలేదు. కాకపోతే జగన్ వేసే ప్రతి అడుగును గొప్పగా ప్రచారం చేసే సాక్షి ఈ విషయాన్ని వార్తలాగా ప్రచురించలేదు. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంలో ఇన్ని రోజులపాటు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారు జగన్. ఆ తర్వాత ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత తన జాతీయ రాజకీయ వ్యవహారాన్ని పూర్తిగా మార్చుకున్నారని తెలుస్తోంది. జగన్ కేసి వేణుగోపాల్ తో మాట్లాడినట్టు కొంతమంది విశ్లేషకులు సరికొత్త విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓటు బ్యాంకు చీల్చింది.. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకునే స్థాయిలో ఓట్లు రాకపోయినప్పటికీ.. ఓట్ల చీలిక ద్వారా వైసిపి విజయవకాశాలను చాలా వరకు దెబ్బతీసింది. భవిష్యత్తు కాలంలో ఫ్యాన్ పార్టీ.. కాంగ్రెస్ ఓకే గొడుగు కిందికి రావడం లేదా ఇండియా కూటమి భాగస్వామ్యంలో వైసిపి చేరినా.. ఏపీలో కూటమికి గట్టి పోటీ ఇవ్వచ్చని.. కేంద్రంలో కమలం పార్టీ వ్యతిరేక పక్షంలో చేరడానికి జగన్ కు మార్గం సిద్ధమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఏకైక అడ్డంకి వైయస్ షర్మిల జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఏకైక అడ్డంకి వైయస్ షర్మిల. ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. జగన్ మీద.. ఆయన పరిపాలన తీరు మీద అనేకసార్లు తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు.
షర్మిలకు.. జగన్ కు మధ్య ఆస్తి వివాదాలు.. కుటుంబ వివాదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య అంగీకారం కుదిరితే తప్ప కాంగ్రెస్.. వైసిపి దోస్తీ సాధ్యం కాదు. రాజకీయాలలో ఎవరూ శాశ్వతంగా శత్రువులుగా ఉండిపోరు. అలాగని మిత్రులుగా కొనసాగలేరు. ఒకవేళ హై కమాండ్ గనుక ఆదేశాలు జారీ చేస్తే కచ్చితంగా కుటుంబ వివాదాలను పక్కనపెట్టి జగన్.. షర్మిల ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. రక్షణ దక్కడం లేదు జగన్ ఇప్పుడు ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం వెనుక గతంలో లభించినట్టుగా కేంద్ర పెద్దల నుంచి ఆయనకు రక్షణ దక్కడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి కేంద్ర బృందాలు విచారణను వేగవంతం చేస్తున్నాయి. అందువల్లే ప్రాంతీయంగా ఒంటరిగా పోరాటం చేయడం కంటే.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టి.. వ్యూహాత్మక రక్షణ పొందాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసి వేణుగోపాల్ తో జగన్ సాగించిన ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనని.. అసలు విషయం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ చర్చలు ఎక్కడి దాకా దారి తీస్తాయి.. ఎటువంటి రాజకీయ విస్పోవడానికి కారణమవుతాయనేది చూడాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ గనుక జగన్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే.. ముమ్మాటికి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనానికి కారణం అవుతుంది.