Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ టీం ఈ సీజన్ లో కామనర్స్ జీవితాలతో ఆటలు ఆడుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్ లో మనకు కామనర్స్ ని చూస్తే చాలా కోపం వచ్చేది. సెలబ్రిటీల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉన్నింది. కానీ ఈ సీజన్ లో రివర్స్. కామనర్స్ పట్ల సెలబ్రిటీలు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పైగా బిగ్ బాస్ టీం కూడా సెలబ్రిటీలకు అనుకూలంగా పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాడు. గ్రాండ్ లాంచ్ రోజే కామనర్స్ కి అన్యాయం జరిగింది. సెలబ్రిటీలను 10 మందిని హౌస్ లోకి పంపగా , కామనర్స్ ని కేవలం 6 మందిని మాత్రమే లోపలకు పంపారు. ఎలాగో గేమ్స్ హౌస్ లోపల విడదీసి పెడుతారు అనే క్లారిటీ అందరిలో ఉంది. అలాంటప్పుడు సమానమైన కౌంట్ ఉండాలి కదా.
ఎందుకు ఇలా కేవలం 6 మందిని మాత్రమే పంపారు. పైగా చాలా తెలివిగా వ్యవహరిస్తూ, చరణ్ ని ఎలిమినేట్ చేయడానికి పెద్ద స్కెచ్ వేశాడు బిగ్ బాస్. హౌస్ లోకి అతన్ని పంపినట్టే పంపి , కేవలం 4 రోజుల్లోనే ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హాట్ స్టార్ లైవ్ లో ఆ ప్రక్రియ సాగుతోంది. ఇదంతా పక్కన పెడితే చరణ్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి చాలా డల్ గా ఉన్నాడు , అతన్ని ఎలిమినేట్ చేయడమే మంచిది అని కొంతమంది అంటున్నారు. చరణ్ ‘అగ్ని పరీక్ష 2’ లో కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. కేవలం ఆడిషన్స్ సమయం లో ఒక్కటే మెరిశాడు. అయినప్పటికీ ఎంతో మంది ఇతనితో పోలిస్తే టాలెంటెడ్ గా ఉన్నప్పటికీ బిగ్ బాస్ టీం వాళ్ళని ఎంచుకోకుండా ఇతన్ని హౌస్ లోకి పంపారు. హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ బోలెడన్ని ఆశలతో వస్తారు, ఆ ఆశలపై నీళ్లు జల్లినట్టే కదా. కనీసం అతన్ని ఒక వారం కూడా హౌస్ లో ఉంచకుండా పంపేయడం ఏంటి అని విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు.
పైగా టాస్కు నిర్వహించి , ఎలిమినేట్ చేసినా న్యాయంగానే ఉండేది. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ మెజారిటీ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు నాలుగు రోజుల నుండి సామాన్యులపై ఎక్కి తోక్కేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఓటింగ్ పద్దతిని ఎంచుకుంటారు?, ఇదెక్కడి న్యాయం. రామ కృష్ణ విషయం లో కూడా ఇదే చేశారు. అతని కెరీర్ ని నాశనం చేశారు. అతను పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాడనే విషయం ‘అగ్ని పరీక్ష 2’ జ్యూరీ కి తెలుసు. అయినప్పటికీ అతని చేతిపై టాటూ వేయించాడు. ఇక జీవితం లో అతను పోలీస్ అయ్యే అవకాశం లేదు. ‘బిగ్ బాస్’ కోసం ఇంత త్యాగం చేసినప్పటికీ కూడా అవకాశం ఇవ్వలేదు , కనీసం వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా కూడా ఆయనకు అవకాశం ఇచ్చేందుకు టీం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇలా సామాన్యులను ఒక రియాలిటీ షో కోసం బలి చేస్తున్నారు.