Kodali Nani: నిజమే ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఎవరూ అంచనా వేయలేరు. నాయకులు కొన్ని సందర్భాలలో ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారో అర్థం కాదు. ఒకప్పుడు నాయకులు మాట్లాడిన మాటలకు అంతగా ప్రాచుర్యం లభించేది కాదు. కానీ ఇప్పుడు మీడియా.. సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు సెన్సేషన్ లభిస్తుంది. ఇప్పటి మీడియాకు సెన్సేషన్ మాత్రమే కావాలి కాబట్టి అటువంటి వాటికే వేల్యూ ఇస్తుంది.
తాజాగా ఏపీలో ఒక రాజకీయ నాయకుడు సంచలనం సృష్టించారు. ఏపీ రాజకీయాలలోకి కెసిఆర్ ప్రస్తావని తీసుకొచ్చారు. వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ అంత గొప్ప స్థానంలో లేరు. డేస్ కి నేత స్థానం నుంచి వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా ఆయన తన పరిధిని తగ్గించుకున్నారు. పైగా రేవంత్ రెడ్డి వరుసగా సవాళ్లు విసురుతున్నప్పటికీ కూడా నిశ్శబ్దంగా ఉండి పోతున్నారు. మరోవైపు కూతురు చేస్తున్న విమర్శలు.. వ్యవసాయ క్షేత్రంలో భూములు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలు కేసీఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ రాష్ట్రంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. వైసిపి కీలక నాయకుడు కొడాలి నాని కెసిఆర్ కు నమస్తే తెలంగాణను మించి.. టీ న్యూస్ ను మించి.. అద్దెకి తెచ్చుకున్న యూట్యూబ్ ఛానల్స్ ని మించి.. సోషల్ మీడియాలో జాకీలు పెట్టి లేపే పెయిడ్ జర్నలిస్టుల నుంచి కొడాలి నాని కెసిఆర్ కు ఎలివేషన్ లుచ్చారు.
స్థానిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ప్రచారంలో కొడాలి నాని నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. కెసిఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారని.. చివరికి పదవులను కూడా వదులుకున్నారని నాని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి కెసిఆర్ అంటేనే ఆంధ్ర ప్రజలకు విపరీతమైన మంట. పైగా ఆంధ్ర ప్రజలను తెలంగాణ ఉద్యమంలో తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు. అలాంటప్పుడు కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని నాని చెబితే ఆంధ్ర ప్రజలు ఊరుకుంటారా.. పైగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతానని చెప్పి ఏం చేశారో అందరికీ గుర్తుంది. ఇన్నాళ్లపాటు గులాబీ పార్టీ.. ఫ్యాన్ పార్టీ మధ్య అంతర్గత స్నేహం మాత్రమే ఉండేదని అందరు అనుకున్నారు. కొడాలి నాని వ్యాఖ్యల తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
వాస్తవానికి ప్రతి సభలో జగన్ గురించి అహో ఓ హో అంటూ నాని చెబుతూ ఉంటారు. సోనియాగాంధీని ఎదిరించిన నాయకుడు.. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన నాయకుడు.. ఒంటరిగా పోరాటం చేసే గెలిచిన నాయకుడు అని ఎలివేషన్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రస్తావన కాకుండా కేసీఆర్ గురించి మాత్రమే కొడాలి నాని చెప్పడం ఇక్కడ విశేషం. అంటే స్థానిక ఎన్నికల్లో జగన్ పేరు చెప్తే ఓట్లు పడవు కాబట్టి.. కెసిఆర్ పేరు కొడాలి నాని తీసుకొచ్చారని అనుకోవచ్చా.. ఇలా అయితే వైసిపి స్థానిక ఎన్నికల్లో గెలిచినట్టేనని టిడిపి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.